Shaakuntalam: ‘మల్లికా మల్లికా’ వీడియో సాంగ్‌.. అబ్బ ఏముందిరా బాబు సమంత!

ABN , First Publish Date - 2023-03-31T21:04:56+05:30 IST

మల్లికా మల్లికా పాటకు యూనిట్‌లోనూ స్పెషల్‌ అభిమానులున్నారు. సమంతగారికి ఈ పాట ఇష్టమని ఆమె ఇటీవల ఇంటర్వ్యూలలోనూ చెప్పారు. రికార్డింగ్‌ సమయంలో ఎంతగా

Shaakuntalam: ‘మల్లికా మల్లికా’ వీడియో సాంగ్‌.. అబ్బ ఏముందిరా బాబు సమంత!
Samantha in Shaakuntalam

‘‘శాకుంతలం (Shaakuntalam) సినిమా చూశాను. అత్యంత అద్భుతంగా అనిపించింది. ఆ క్షణం నుంచి వీడియో సాంగ్స్ విడుదల చేసేద్దామా అన్నంత ఆత్రుతగా ఉంది. ఆ విషయాన్నే గుణశేఖర్‌ (Gunasekhar) గారితో పంచుకున్నాను. సినిమాలో నాకు అత్యంత ఇష్టమైన పాట మల్లికా మల్లికా (Mallika Mallika). ఈ పాటను వీడియోలో చూడటం చాలా ఆనందకరమైన విషయం. ప్రజలందరికీ ఇప్పుడు మల్లికా మల్లికా వీడియో సాంగ్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నాం’’ అని అన్నారు ఈ సినిమాలో శకుంతలగా చేసిన హీరోయిన్ సమంత (Samantha). ఆమె టైటిల్ టైటిల్‌ పాత్రలో నటించిన సినిమా ‘శాకుంతలం’. సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గుణ టీమ్‌ వర్క్స్ (Guna Team Works) నిర్మించింది. గుణశేఖర్‌ రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తాజాగా సమంతకు ఎంతో ఇష్టమైన ‘మల్లికా మల్లికా’ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో సమంతని చూసిన వారంతా.. అబ్బ సమంత ఏముందిరా బాబూ! అని ఆశ్చర్యపోతున్నారు. (Mallika Mallika Video Song From Shaakuntalam)

‘మల్లికా మల్లికా మాలతీ మాలికా

చూడవా చూడవా ఏడినా ఏలికా,

హంసికా హంసికా జాగులే చేయక

పోయిరా పోయిరా రాజుతో రాయికా,

అతనితో కానుకా ఈయనా నేనికా

వలపుకే నేడొక వేడుకే కాదా...’ అంటూ సాగిన ఈ పాటకు చైతన్య ప్రసాద్‌ (Chaitanya Prasad) అందించిన సాహిత్యం అందించారు. మణిశర్మ (Mani Sharma) కూర్చిన బాణీకి అందంగా న్యాయం చేశారు సింగర్‌ రమ్య బెహరా (Ramya Behara). పాట వింటున్నప్పుడు ఎంత శ్రావ్యంగా అనిపించిందో, స్క్రీన్‌ మీద చూసినప్పుడు అంతే ఇంపుగా కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే మల్లిక మల్లిక పాట విజువల్‌ ఫీస్ట్‌లా ఉంది. మరీ ముఖ్యంగా సమంత చాలా అందంగా కనిపిస్తోంది.

samantha.jpg

ఈ పాట విడుదల సందర్భంగా దర్శకుడు గుణశేఖర్‌ (Director Gunasekhar) మాట్లాడుతూ.. ‘‘మల్లికా మల్లికా పాటకు యూనిట్‌లోనూ స్పెషల్‌ అభిమానులున్నారు. సమంతగారికి ఈ పాట ఇష్టమని ఆమె ఇటీవల ఇంటర్వ్యూలలోనూ చెప్పారు. రికార్డింగ్‌ సమయంలో ఎంతగా ఆస్వాదించామో, ఈ పాటను తెరమీద చూసుకున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. వెన్నెల, హంసలు, శ్వేతవర్ణ దుస్తుల్లో సమంత, పువ్వుల అలంకరణలు, చుట్టూ పరిసరాలు, అక్కడి ముని కన్యలు... ఈ పాట బిగ్‌ స్క్రీన్‌ మీద మరో రేంజ్‌లో అలరిస్తుందనే నమ్మకం ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉందని చెబుతుంటే ఆనందంగా అనిపించింది. ఈ నెల 14న శాకుంతలం సినిమాను పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అని అన్నారు. (Director Gunasekhar about Malllika Mallika Song)


ఇవి కూడా చదవండి:

*********************************

*Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?

*Allu Arjun: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి బన్నీ రాలేదని ట్రోల్ చేశారుగా.. ఈ విషయం తెలిస్తే?

*Poonam Kaur: ఫైట్ చేయగలను.. డ్యాన్స్ చేయగలనంటూ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే..

*Sarath Babu: హాస్పిటల్‌లో నటుడు శరత్ బాబు.. అసలేమైంది?

*Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

*Rocking Rakesh: జోర్దార్ సుజాత టార్చర్ పెట్టిందా? ఏడుస్తూ.. అసలు విషయం చెప్పేసిన రాకేష్!

*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

Updated Date - 2023-03-31T21:04:58+05:30 IST