Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?

ABN , First Publish Date - 2023-03-31T19:10:20+05:30 IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో.. అందులో నటించిన స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) గ్లోబల్ స్థాయి గుర్తింపును

Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?
Ram Charan and Jr NTR

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో.. అందులో నటించిన స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) గ్లోబల్ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా జరిగిన ఆస్కార్ అవార్డుల (Oscar Awards) వేడుకలో ఈ ఇద్దరూ హాలీవుడ్ ప్రముఖుల్ని ఎలా ఆకర్షించారో తెలియంది కాదు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం కోసం జరిగిన ప్రమోషన్స్‌లో తారక్ (Tarak), చరణ్‌ (Charan) కీలక పాత్ర వహించారు. హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ప్రమోషన్స్ జరిగినన్నీ రోజులు.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి అంతా మాట్లాడుకునేలా చేశారు. ఇక ఆ పర్వం ముగించుకుని వచ్చిన తర్వాత.. ఎవరి సినిమా షూటింగ్స్‌లో వారు బిజీ అయ్యారు. శంకర్ (Shankar) దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) షూటింగ్‌లో చరణ్ బిజీ అయితే.. కొరటాల శివ (Koratala Siva)తో చేయబోతోన్న ‘NTR30’ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిపి.. సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ లోపు వీరిద్దరూ నటించిన పాత సినిమాల స్పెషల్ షోస్ అంటూ టాలీవుడ్‌లో హడావుడి జరిగింది. అయితే ఇప్పుడీ స్పెషల్ షోస్ విషయంలో రామ్ చరణ్ రికార్డులు బద్దలు కొడితే.. తారక్ మాత్రం దారుణ అవమానాన్ని చవిచూడాల్సి వచ్చింది.

విషయంలోకి వస్తే.. రామ్ చరణ్ పుట్టినరోజును (Ram Charan Birthday) పురస్కరించుకుని గతంలో ఆయన నటించిన ఫ్లాప్ సినిమా ‘ఆరెంజ్’ను స్పెషల్ షోస్ (Orange Special Shows) అంటూ థియేటర్లలోకి తీసుకువచ్చారు. 2 రోజుల పాటు అనుకున్న ఈ స్పెషల్ షోస్‌కి భారీ స్పందన రావడంతో.. మరో రెండు రోజుల పాటు పొడిగించారు కూడా. మొత్తం ఈ చిత్రం ఈ స్పెషల్ షోస్ ద్వారా సుమారు రూ. 3 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టి.. ఇంతకు ముందు ఇలా రీ రిలీజ్ అయిన చిత్రాల విషయంలో రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఏ అకేషన్ లేకుండా.. సడెన్‌గా ఎన్టీఆర్, పూరి జగన్ (Puri Jagan) కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ సినిమా స్పెషల్ షోస్‌ (Andhrawala Special Shows)ని గురువారం నుంచి ప్లాన్ చేశారు. అయితే.. గతంలో ఈ సినిమా ఎటువంటి రిజల్ట్‌ని అందుకుందో.. అంతకంటే దారుణమైన స్పందన ఈ స్పెషల్ షోస్‌కి రావడంతో.. సోషల్ మీడియాలో వేరే హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాని, వచ్చిన కలెక్షన్స్‌ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Jr-NTR.jpg

‘ఆంధ్రావాలా’ స్పెషల్ షోస్ డే 1 కలెక్షన్స్ (Andhrawala Special Shows Day 1 Collections) అంటూ.. సీడెడ్‌లో రూ. 480, ఆంధ్రాలో రూ. 460, నైజాంలో రూ. 60 అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌తో తారక్‌ని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టైమ్‌లో ‘మాన్ ఆఫ్ ద మాసెస్’ (Man of the Masses) ట్యాగ్ విషయంలో తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య ఎటువంటి యుద్ధం జరిగిందో తెలిసిందే. అలాగే ఆ సినిమాలోని చరణ్, తారక్ పాత్రలపై కూడా ఫ్యాన్స్ గొడవలు పడ్డారు. ఇప్పుడు ఈ స్పెషల్ షోస్ విషయంలో తారక్‌ని అవమానిస్తూ.. ఫ్లాప్ సినిమాతో కూడా రికార్డులు కొట్టగల సత్తా మాది అనేలా కొందరు మెగా ఫ్యాన్స్ (Mega Fans) కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ‘ఆరెంజ్’ స్పెషల్ షోస్ విషయంలో రికార్డులు క్రియేట్ చేయవచ్చు కానీ.. అది చరణ్ బర్త్‌డేకి విడుదల చేశారు. అలాగే.. ఈ షోస్ ద్వారా వచ్చిన కలెక్షన్స్‌ మొత్తం ‘జనసేన’ (Janasena) పార్టీకి విరాళంగా ఇస్తామని ప్రకటించారు. అందువల్లే ఆ సినిమాకి ఆదరణ లభించింది. కానీ ‘ఆంధ్రావాలా’ విషయంలో స్పెషల్ షోస్ వేస్తున్నారనే విషయంగానీ, పలానా రోజు నుంచి అనిగానీ పెద్దగా ప్రమోషన్స్ నిర్వహించలేదు. అందుకే ఇటువంటి రిజల్ట్ వచ్చిందంటూ.. త్వరలో మేమేంటో చూపిస్తామని తారక్ ఫ్యాన్స్ (Tarak Fans) కౌంటర్స్ వేస్తున్నారు. ఎందుకంటే, తారక్ పుట్టినరోజున (మే 20) రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహాద్రి’ (Simhadri) చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నారు. 4K (అల్ట్రా HD), డాల్బీ అట్మాస్ 5.1తో ‘సింహాద్రి’ని (Simhadri Re Release) విడుదల చేసేందుకు ప్రస్తుతం కార్యాచరణ జరుగుతోంది. ఆ సినిమాతో రీ రిలీజ్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో నందమూరి ఫ్యాన్స్ (Nandamuri Fans) చూపిస్తామంటున్నారు. అది మ్యాటర్.

ఇవి కూడా చదవండి:

*********************************

*Allu Arjun: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి బన్నీ రాలేదని ట్రోల్ చేశారుగా.. ఈ విషయం తెలిస్తే?

*Poonam Kaur: ఫైట్ చేయగలను.. డ్యాన్స్ చేయగలనంటూ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే..

*Sarath Babu: హాస్పిటల్‌లో నటుడు శరత్ బాబు.. అసలేమైంది?

*Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

*Rocking Rakesh: జోర్దార్ సుజాత టార్చర్ పెట్టిందా? ఏడుస్తూ.. అసలు విషయం చెప్పేసిన రాకేష్!

*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

Updated Date - 2023-03-31T19:21:38+05:30 IST