Poonam Kaur: ఫైట్ చేయగలను.. డ్యాన్స్ చేయగలనంటూ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే..

ABN , First Publish Date - 2023-03-30T17:13:47+05:30 IST

పూనమ్ కౌర్ (Poonam Kaur).. ఈ మధ్య వార్తలలో ఎలా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య అనే కాదు.. ఎప్పుడూ ఆమె వార్తలలో ఉంటూనే ఉంటుంది. సోషల్ మీడియా (Social Media)లో..

Poonam Kaur: ఫైట్ చేయగలను.. డ్యాన్స్ చేయగలనంటూ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే..
Heroine Poonam Kaur

పూనమ్ కౌర్ (Poonam Kaur).. ఈ మధ్య వార్తలలో ఎలా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య అనే కాదు.. ఎప్పుడూ ఆమె వార్తలలో ఉంటూనే ఉంటుంది. సోషల్ మీడియా (Social Media)లో ఆమె చేసే ట్వీట్స్.. ఇన్‌డైరెక్ట్‌గా ఎవరో ఒకరిని టార్గెట్ చేసినట్లుగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ గురించే కాకుండా.. రాజకీయాల పరంగానూ ఆమె ట్వీట్స్ వేస్తుంటారు. అలాగే తనకున్న ఆధ్యాత్మికతను కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె తెలియజేస్తుంటారు. పూనమ్.. తను వెళ్లే ఆలయాలకున్న విశిష్టతను క్లుప్తంగా తెలియజేస్తూ.. ఆ ఆలయాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అలాగే ఇండస్ట్రీలో తనని ఇబ్బంది పెట్టిన వారి గురించి ఇన్‌డైరెక్ట్‌గా పంచ్‌లు వేస్తుంటుంది. రీసెంట్‌గా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఫైట్ చేయగలను, డ్యాన్ చేయగలను అంటూ పూనమ్ కౌర్ ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Poonam Kaur Dance Video Goes Viral)

ఈ వీడియోలో ఏముందంటే.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), అందాల నటి శ్రీదేవి (Sridevi) కలిసి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) చిత్రంలోని అబ్బనీ తియ్యనీ దెబ్బ సాంగ్ బీట్‌కు తగినట్లుగా మూమెంట్స్ ఇస్తూ పూనమ్ కౌర్ డ్యాన్స్ (Poonam Kaur Dance) చేస్తుంది. శ్రీదేవి అభిమాని అని ట్యాగ్ చేస్తూ ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియోని నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియో షేర్ చేసిన పూనమ్.. ‘నేను ఫైట్ చేయగలను.. నేను డ్యాన్స్ చేయగలను’ అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియోని సేవ్ చేసి ఉంచిన తన మేనకోడలికి పూనమ్ థ్యాంక్స్ కూడా చెప్పింది. పాటకి తగినట్లుగా ఆమె చేస్తున్న డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు.. ‘వావ్’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఈ మధ్య మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఓ వేదికపై ఆమె సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నేను తెలంగాణ అమ్మాయిని. మతం, మైనారిటీ అంటూ నన్ను తెలంగాణ (Telangana) నుంచి వెలివేస్తున్నారు. నేను తెలంగాణలోనే పుట్టాను. కానీ నన్ను వేరు చేస్తున్నారు. నేను పంజాబీ అమ్మాయి కావొచ్చు.. కానీ పుట్టింది.. పెరిగింది ఇక్కడే. నా మతం.. నన్ను నా రాష్ట్రము నుంచి విడదీయలేదు. నేను పక్కా తెలంగాణ బిడ్డని.. దయచేసి నన్ను వెలివేయకండి.. వేరుగా చూడకండి అంటూ కన్నీటి పర్యంతమైంది (Poonam Kaur Emotional).


ఇవి కూడా చదవండి:

*********************************

*Sarath Babu: హాస్పిటల్‌లో నటుడు శరత్ బాబు.. అసలేమైంది?

*Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

*Rocking Rakesh: జోర్దార్ సుజాత టార్చర్ పెట్టిందా? ఏడుస్తూ.. అసలు విషయం చెప్పేసిన రాకేష్!

*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

*Sana: అందుకే అలీ రెజాతో రొమాంటిక్ సీన్ చేశా.. అలాంటివి ఇంకా చేయాలని ఉంది

*Upasana: ఉపాసన బేబీ బంప్ ఫొటో వైరల్.. ఇక డౌట్స్ వద్దమ్మా..!

*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-30T17:13:48+05:30 IST