Allu Arjun: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి బన్నీ రాలేదని ట్రోల్ చేశారుగా.. ఈ విషయం తెలిస్తే?

ABN , First Publish Date - 2023-03-30T22:28:34+05:30 IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) రీసెంట్‌గా తన పుట్టినరోజు (Birthday)ను పురస్కరించుకుని.. సినీ ఇండస్ట్రీలోని హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీలో కొందరు కనిపించకపోవడంతో..

Allu Arjun: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి బన్నీ రాలేదని ట్రోల్ చేశారుగా.. ఈ విషయం తెలిస్తే?
Ram Charan and Allu Arjun

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) రీసెంట్‌గా తన పుట్టినరోజు (Birthday)ను పురస్కరించుకుని.. సినీ ఇండస్ట్రీలోని హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీలో కొందరు కనిపించకపోవడంతో.. వారిపై అంతా ట్రోల్ చేస్తున్నారు. ఈ పార్టీకి కొంతమంది హీరోలను పిలవలేదంటూ మెగాస్టార్ (Mega Star), మెగా పవర్ స్టార్‌ (Mega Power Star)లని.. అలాగే వారు పిలిచినా కొందరు హీరోలు రాలేదని ఆ రాని హీరోలను.. సోషల్ మీడియా (Social Media) వేదికగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ పార్టీపై భారీ స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ఈ పార్టీలో కనిపించకపోవడంతో, అతనిని మెగా ఫ్యామిలీ (Mega Family) ఆహ్వానించలేదా? అలాగే నందమూరి నటసింహం బాలయ్యని (Natasimham Balakrishna) కూడా ఆహ్వానించలేదా? అంటూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. పిలిచినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఈ పార్టీకి రాలేదంటూ మెగా ఫ్యాన్స్‌ (Mega Fans)లోని కొందరు బన్నీపై (Bunny) కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. ఇలా ఓ చిన్నపాటి యుద్ధమే (War) సోషల్ మీడియాలో నడుస్తుంది. అయితే నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) హీరోల సంగతి పక్కన పెడితే.. బన్నీ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారనేది తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాన్ని చూస్తుంటే తెలుస్తుంది.

ఎందుకంటే, బన్నీ గతంలో చెప్పాడు.. ‘ఫ్యామిలీ పర్సన్స్‌పై ప్రేమను బహిర్గతంగా ప్రదర్శించుకోవాల్సిన పరిస్థితి నాకవసరం లేదు బ్రదర్’ అని. ఎందుకంటే, చరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు పర్సనల్‌గా ఫోన్ చేసి చెప్పి ఉండవచ్చు.. లేదంటే డైరెక్ట్‌గా కలిసి అయినా చెప్పవచ్చు. ఒకే ఫ్యామిలీకి చెందిన వారు కాబట్టి.. వారి నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పలేదని అనడం సమంజసం కానే కాదు. కానీ కొందరు కావాలనే అల్లు అర్జున్‌ని (Allu Arjun) టార్గెట్ చేస్తూ.. ఆయన యాక్టింగ్ ఎంట్రీ దగ్గర నుంచి లాగుతున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ ఇండియాలో లేరు. ఆయన.. తన భార్య, స్నేహితులతో కలిసి వియత్నాం వెళ్లారు. అక్కడొక పార్టీకి అటెండ్ అవడంతో పాటు సరదాగా విహరించడానికి వారంతా వెళ్లారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ యాత్రలో రామ్ చరణ్ సోదరీమణులైన సుస్మిత (Sushmita), శ్రీజ(Srija)లు కూడా ఉన్నారు. అందుకే వారిద్దరూ కూడా చరణ్ బర్త్‌డే పార్టీ (Charan Birthday Party)లో కనిపించలేదు. ఈ విషయం ఎలా తెలిసిందంటే..

Allu.jpg

తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ఈ విషయాన్ని రివీల్ చేసింది. మేమంతా వెకేషన్‌‌లో ఉన్నట్లుగా తెలుపుతూ.. ఆమె ఒక వీడియోని షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ పీఆర్ టీమ్ కూడా ఓ విషయాన్ని రివీల్ చేశారు. చరణ్ బర్త్‌డే రోజు అల్లు అర్జున్ వీడియో కాల్ చేసి చాలా సేపు మాట్లాడారని, వారి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని తెలిపారు. ఈ విషయం తెలియని మెగా ఫ్యాన్స్, అల్లు ఆర్మీ (Allu Army) ఒకరిని ఒకరు నిందించుకుంటూ.. మెగా హీరోల ప్రతిష్టను సోషల్ మీడియా వేదికగా దిగజారుస్తున్నారు. ఇలాంటిదే నందమూరి హీరోలు (Nandamuri Heroes) ఈ పార్టీకి రాకపోవడానికి కారణమై ఉండవచ్చు. ఏ విషయం తెలియకుండా.. సోషల్ మీడియాకి ఎక్కి రచ్చ రచ్చ చేస్తే.. పోయేది మీ అభిమాన హీరోల పరువే అని.. ఇకనైనా ఫ్యాన్స్ గమనిస్తే మంచిది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Poonam Kaur: ఫైట్ చేయగలను.. డ్యాన్స్ చేయగలనంటూ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే..

*Sarath Babu: హాస్పిటల్‌లో నటుడు శరత్ బాబు.. అసలేమైంది?

*Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

*Rocking Rakesh: జోర్దార్ సుజాత టార్చర్ పెట్టిందా? ఏడుస్తూ.. అసలు విషయం చెప్పేసిన రాకేష్!

*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

Updated Date - 2023-03-30T22:28:37+05:30 IST