సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Dasara Trailer: ఇదీ ట్రైలర్‌ అంటే.. ఒక్కొక్కనికి రాల్తాయ్!!

ABN, First Publish Date - 2023-03-14T18:24:49+05:30

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దసరా’ (Dasara). శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) భారీ ఎత్తున నిర్మిస్తుండగా.. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల

Natural Star Nani Dasara Movie Poster
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దసరా’ (Dasara). శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) భారీ ఎత్తున నిర్మిస్తుండగా.. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నాని సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. మార్చి 30న ఈ చిత్రం పాన్ ఇండియా (Pan India) వైడ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. నాని కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు కోలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని చోట్ల హంగామా చేస్తున్నారు. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. లక్నో‌లోని ప్రతిభా థియేటర్‌లో అభిమానుల కోలాహలం మధ్య నాని అండ్ టీమ్ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. నాని ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్న ఈ ట్రైలర్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది. అలాగే పాన్ ఇండియాకి సరిపడా కథతో ఈ సినిమా తెరకెక్కినట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

ట్రైలర్‌లో ఉన్న మ్యాటర్ విషయానికి వస్తే.. తెలంగాణ స్లాంగ్‌లో వచ్చే పాటతో మొదలైన ఈ ట్రైలర్‌లో.. వెన్నెల వచ్చిందిరా అంటూ కీర్తి సురేష్‌ని పరిచయం చేశారు. డీ గ్లామరైజ్డ్ లుక్‌లో వెన్నెలగా కీర్తిసురేష్‌ ఇందులో నటించింది. ‘ధరణిగా.. పెట్టి పుట్టావ్‌రా.. నా కొ**’ అంటూ పెళ్లికి సిద్ధమైన కీర్తి.. తనని పొందడం ధరణి అదృష్టం అన్నట్లుగా అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్‌ని చూపించింది. ధరణిగా నాని మాస్ ఎంట్రీ, ఆ తర్వాత వచ్చే సీన్లు, పోలీస్ స్టేషన్ సీన్ సరికొత్తగా ఉన్నాయి. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నాని షర్ట్ తీసేసి.. ఊర మాస్ అవతారంలో కనిపించే సీన్ ఈ ట్రైలర్‌కే హైలెట్ అని చెప్పుకోవచ్చు. (Dasara Trailer Talk)

‘తాగి మరిచిపోవుడు తప్పు కాదు.. తప్పు చేసి మరిచిపోవుడు తప్పు’.. అంటూ ధరణిని రెచ్చగొట్టడం.. ఓ మనిషిని వేటాడటం, నాని కత్తిపట్టినప్పుడు వచ్చే డైలాగ్ ట్రైలర్‌లో మాస్ పవర్‌ని మరింతగా హైలెట్ చేశాయి. ‘పది తలకాయలు ఉన్నోడే.. ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్కచావు సచ్చిండు.. పురాణాలకు మించిన బతుకులా మనవి’ అంటూ సముద్రఖని పరిచయం, ఆయన లుక్ ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత ‘ఒక్కొక్కనికి మొలతాడు కింద *****’ అని నాని చెప్పే పవర్ ఫుల్ డైలాగ్.. తర్వాత వచ్చే సీన్లు మైండ్ బ్లోయింగ్ అనేలా.. ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ఓవరాల్‌గా ఓ పవర్ ఫుల్ కథతో ఈ సినిమా తెరకెక్కినట్లుగానూ, నాని చేసే ఊరమాస్ జాతరకి సిద్ధం కండి అనేలా అయితే ఈ ట్రైలర్‌ ఉంది. మ్యూజిక్, కెమెరా ఇలా వేటికవే హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక మార్చి 30న ఎట్లయితే గట్లయి సూసుకుందాం.. (Dasara Telugu Trailer)


ఇవి కూడా చదవండి:

*********************************

*Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?

*Oscar to RRR: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందనిదే..

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

Updated Date - 2023-03-14T18:32:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!