Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం

ABN , First Publish Date - 2023-03-13T18:16:32+05:30 IST

తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఇటువంటి చిత్రాలని

Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం
Talasani Srinivas Yadav About Oscar Award to RRR

తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఇటువంటి చిత్రాలని ఆస్కార్ ఎంట్రీకి పంపించకుండా.. కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం స్వార్థంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ మాసాబ్ టాంక్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో FDC చైర్మన్ అనిల్ కూర్మాచలం‌ (Anil Kurmachalam)తో కలిసి మాట్లాడారు. RRR చిత్రానికి ఆస్కార్ అవార్డ్ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి FDC చైర్మన్, FDC ED కోశోర్ బాబు.. జర్నలిస్టు‌లకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఆస్కార్ అవార్డ్‌ (Oscar Award)ను అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రంగా RRR చరిత్రలో నిలిచిపోతుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు (Naatu Naatu) పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతుంది. ఆస్కార్ అవార్డ్‌ను అందుకున్న గొప్ప చిత్రం RRR‌ను రూపొందించిన డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli), మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి (MM Keeravani), లిరిక్ రైటర్ చంద్రబోస్ (Chandra Bose), గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి సన్మానం చేయాలని నిర్ణయించాం.

కేంద్రంలోని BJP ప్రభుత్వానికి మొదటి నుండి కూడా దక్షణాది రాష్ట్రాలు అంటే చిన్నచూపు ఉంది. ఆస్కార్ అవార్డుల కోసం ఎంట్రీ పంపండి అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం (BJP Government) గుజరాత్ (Gujarat) రాష్ట్రానికి చెందిన సినిమా ‘చెల్లో షో’ (Chhello Show)ను ఆస్కార్ ఎంట్రీకి పంపించారు. కానీ RRR చిత్రం ఆస్కార్‌కు ఎంపికై వారికి తగిన గుణపాఠం చెప్పింది. చిత్ర దర్శకులు రాజమౌళి కృషితోనే ఆస్కార్ అవార్డ్ దక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)గారి నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సినిమా రంగానికి తెలంగాణ (Telangana) కేరాఫ్ అడ్రస్‌గా మారింది. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటూ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుంది..’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..

Updated Date - 2023-03-13T18:16:33+05:30 IST