Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2023-03-13T22:56:16+05:30 IST

కొన్ని రోజుల క్రితం.. ఇదే అవార్డ్‌పై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయగా.. అవి వివాదంగా (Controversy) మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన..

Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?
Thammareddy Bharadwaja

‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి ఆస్కార్ అవార్డు (Oscar Award) రావడంతో నాకే కాదు.. సినిమాను ప్రేమించే భారతీయులందరికీ గర్వకారణంగా ఉందని అన్నారు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja). కొన్ని రోజుల క్రితం.. ఇదే అవార్డ్‌పై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయగా.. అవి వివాదంగా (Controversy) మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన.. ఉదాహరణకు చెప్పిన వీడియో బిట్‌ని కట్ చేసి.. ఇలా వైరల్ చేశారంటూ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలపై కామెంట్స్ చేసిన వారందరికీ తమ్మారెడ్డి కౌంటర్ ఇస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. ఆ తర్వాత ఆ వివాదం దాదాపు సద్దుమణిగింది. ఇక ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకున్న సందర్భంగా గర్వంగా ఉందంటూ.. తాజాగా ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. అందులో

‘‘ ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ రావడం చాలా ఆనందంగా ఉంది.. చాలా గర్వంగా ఉంది. నాకే కాదు.. భారతదేశంలోని ప్రతి పౌరుడికి, సినిమాని ప్రేమించే వారికి, సినిమా సంగీతాన్ని ప్రేమించే వారికి.. ఈ పాటకి ఆస్కార్ అవార్డు రావడం గర్వకారణంగా ఉంటుంది. తెలుగు సినిమాలలో తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని ఇచ్చే అతి తక్కువ మందిలో కీరవాణి‌గారు ఒకరు. అలాగే చంద్రబోస్‌గారు కూడా. తెలుగు మాటలు పొందుపరిచి తెలుగు సినిమా పాటలు రాస్తున్న వారిలో చంద్రబోస్‌గారు ఒకరు. వీరిద్దరి కలయికలో తయారైన ఈ నాటు నాటు సాంగ్‌కి అవార్డ్ రావడం అద్భుతం. ఇండియన్ సినిమాకు రావడమే ఫస్ట్ టైమ్. అలాంటిది మన తెలుగు సినిమాకి రావడం నిజంగా అద్భుతం. ఈ అద్భుతానికి నిజంగా మనందరం గర్వించాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. కీరవాణిగారికి, చంద్రబోస్‌గారికి, రాజమౌళిగారికి, ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. (Thammareddy Bharadwaja Comments on Oscar to RRR)

అంతకు ముందు తమ్మారెడ్డి భరద్వాజ ఈ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. కీరవాణి (Keeravani)గారికి అవార్డు వస్తే నాకు వచ్చినంత ఆనందంగా ఉంది. నేను ఇంతకు ముందు కొన్ని వ్యాఖ్యలు చేశాను. కుటుంబంలో పెద్దగా.. ప్రమోషన్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని చెప్పాను. నేను చెప్పిన సందర్భం వేరు. జాగ్రత్త అని చెప్పాను తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. మనవాళ్లకి మంచి పేరు ప్రతిష్ట వస్తుంటే.. నాకంటే ఆనందపడేవారు ఎవ్వరూ ఉండరు. ఇది నా కుటుంబం. మా కుటుంబం (Cinema Family) మధ్యలో ఎవడో వేలు పెట్టి ఏదో లబ్ధి పొందాలని చూసినా.. మా కుటుంబంలో ఎవ్వరూ పట్టించుకోరు. నా గురించి వాళ్లకు తెలుసు. మా వాళ్లకు ఆస్కార్ వచ్చింది. మరొక్కసారి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) టీమ్ మొత్తానికి నా అభినందనలు’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Oscar to RRR: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందనిదే..

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

Updated Date - 2023-03-13T22:56:17+05:30 IST