Hidimbha Reverse Trailer: టాలీవుడ్‌లో తొలిసారి సరికొత్త ప్రయోగం

ABN , First Publish Date - 2023-07-18T12:42:51+05:30 IST

యంగ్ హీరో అశ్విన్ బాబు హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ థియేట్రికల్ రిలీజ్‌కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్), ఓఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర రివర్స్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Hidimbha Reverse Trailer: టాలీవుడ్‌లో తొలిసారి సరికొత్త ప్రయోగం
Hidimbha Movie Unit

యంగ్ హీరో అశ్విన్ బాబు (Ashwin Babu) హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ (Hidimbha) థియేట్రికల్ రిలీజ్‌కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్), ఓఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ‘హిడింబ’ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ‘హిడింబ’ థియేట్రికల్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ సెటప్, గ్రాండ్ మేకింగ్, అత్యున్నత సాంకేతికత ప్రమాణాలతో అందరినీ మెప్పించగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్ర రివర్స్ ట్రైలర్‌ విడుదల చేశారు. ప్రతి సీక్వెన్స్‌ను రివర్స్ ఆర్డర్‌లో ప్రజంట్ చేసిన ఈ ట్రైలర్ సరికొత్తగా అనిపిస్తోంది. టాలీవుడ్‌లో రివర్స్ ట్రైలర్ విడుదల చేయడం ఇదే తొలిసారి.


రెండు వేర్వేరు టైమ్ లైన్స్‌లో కథను నడిపించిన తీరు.. యూనిక్ థాట్‌తో సరికొత్తగా ఈ ట్రైలర్‌ని ప్రజంట్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు, ట్రైలర్‌లో సినిమాలోని రొమాంటిక్, ఇతర అంశాలను కూడా చూపించారు. ఎడిటర్ ఎమ్ ఆర్ వర్మ ట్రైలర్‌ను రివర్స్‌లో కట్ చేసిన విధానం కూడా బాగుంది. వికాస్ బాదిసా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్‌గా ఉంది. మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘హిడింబ’ సినిమాపై ఈ రివర్స్ ట్రైలర్ మరింతగా అంచనాలని పెంచింది. (Hidimbha Reverse Trailer Talk)

Swetha.jpg

ఇక రివర్స్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా హీరో అశ్విన్ బాబు (Ashwin Babu) మాట్లాడుతూ.. కథని బలంగా నమ్మి చేసిన చిత్రమిది. హిడింబ స్క్రీన్‌ప్లే, విజువల్స్ రెగ్యులర్‌గా కాకుండా కొత్తగా వుంటాయి. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. జూలై 20న విడుదలౌతుంది. అందరూ చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు. హీరోయిన్ నందితా శ్వేతా (Nandita Swetha) మాట్లాడుతూ.. హిడింబ రిలీజ్ కోసం చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాం. బేసిగ్గా సినిమా గురించి మేము మాట్లాడటం కామన్. కానీ ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూసిన ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుతున్నారు. ఇది మా విజయంగా భావిస్తున్నాం. జూలై 20 తర్వాత కూడా ఇదే విజయానందంతో కలుస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*NTR and Krishna: రెండు చిత్రాలు.. కథ మాత్రం ఒక్కటే.. అప్పట్లోనే ఇలా జరిగిందనే విషయం తెలుసా?

**************************************

*Saindhav: గాయత్రిగా సారా.. లుక్ విడుదల

**************************************

*Ketika Sharma: ‘బ్రో’ సినిమాకు ఆయన పేరు చాలు

**************************************

*Nidhhi Agerwal: పవర్‌స్టార్‌కి థ్యాంక్స్ చెప్పిన నిధి.. పోస్ట్ వైరల్

**************************************

*SSMB29: మహేష్ కుమార్తె, ఎన్టీఆర్ కుమారుడు.. ఇరు హీరోల ఫ్యాన్స్‌కి ట్రీటే ట్రీటు!

**************************************

*Namrata Shirodkar: గౌతమ్ ఎంట్రీకి టైముంది.. సితార ఇంట్రెస్ట్‌గా ఉంది

**************************************

Updated Date - 2023-07-18T12:42:51+05:30 IST