Ravanasura Trailer: వీడు చాలా డేంజర్‌గాని లెక్కున్నడు తమ్మీ!

ABN , First Publish Date - 2023-03-28T17:24:20+05:30 IST

సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) బ్రదర్‌గా నటించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja).. ఇప్పుడు సోలోగా తన ప్రతాపం చూపేందుకు

Ravanasura Trailer: వీడు చాలా డేంజర్‌గాని లెక్కున్నడు తమ్మీ!
Ravi Teja in Ravanasura Movie

సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) బ్రదర్‌గా నటించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja).. ఇప్పుడు సోలోగా తన ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures), ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై (RT Team Works) రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). హీరో రవితేజతో కలిసి అభిషేక్ నామా (Abhishek Nama) నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ఈ చిత్రం ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రవితేజ క్రిమినల్ లాయర్‌గా కనిపించిన ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేదిగా ఉంది.

ట్రైలర్ విషయానికి వస్తే.. ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌తో మొదలైన ఈ ట్రైలర్.. రవితేజలోని రావణాసురుడిని క్రమక్రమంగా పరిచయం చేసింది. ఇందులో రవితేజ పాత్ర స్వరూపాన్ని తెలియజేయడానికి రావు రమేష్ చెప్పే డైలాగ్ ఒక్కటి చాలు. ‘ఆడు చాలా డేంజర్‌గాని లెక్కున్నడు తమ్మీ..’ అంటూ రావు రమేష్ (Rao Ramesh) తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌తో పాటు.. జయరామ్ (Jayaram) చెప్పే ‘వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్’ డైలాగ్.. రవితేజ ఇందులో ఎంత కిరాతకంగా ఉంటాడో తెలియజేస్తున్నాయి. అలాగే రవితేజ చెప్పే ‘మర్డర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్. నేను ఆర్టిస్ట్‌ని.. నా ఆర్ట్‌ని గౌరవించండి’ డైలాగ్‌తో.. టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చేశారు. మధ్యలో కనిపించే ఐదారుగురు హీరోయిన్లతో రవితేజ చేసే కామెడీ, కోర్ట్ సీన్స్‌తో పాటు.. సుశాంత్, జయరామ్, రావు రమేష్ వంటివారు కనిపించిన తీరు చూస్తుంటే.. దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) ఓ పవర్ ఫుల్ కథతో వస్తున్నట్లుగా అర్థమవుతోంది. (Ravanasura Trailer Talk)

మొత్తంగా అయితే.. రవితేజ మార్క్‌తో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా తెలియజేయడంలో.. ఈ ట్రైలర్ సక్సెస్ అయింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కు మంచి లుక్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా.. రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ వంటివారు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ (Sushanth) ఓ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌పై చిత్రయూనిట్ దృష్టి పెట్టింది. అతి త్వరలోనే గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Ravanasura Trailer)


ఇవి కూడా చదవండి:

*********************************

*Sana: అందుకే అలీ రెజాతో రొమాంటిక్ సీన్ చేశా.. అలాంటివి ఇంకా చేయాలని ఉంది

*Upasana: ఉపాసన బేబీ బంప్ ఫొటో వైరల్.. ఇక డౌట్స్ వద్దమ్మా..!

*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

*Hyper Aadi: రికార్డులు అనేవి పుట్టిందే ఆయనను చూసి.. హైపర్ ఆది స్పీచ్ వైరల్

*Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

*Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-28T17:24:22+05:30 IST