Sana: అందుకే అలీ రెజాతో రొమాంటిక్ సీన్ చేశా.. అలాంటివి ఇంకా చేయాలని ఉంది

ABN , First Publish Date - 2023-03-28T15:37:52+05:30 IST

ఆ యాక్సిడెంట్‌లో అలీరెజా తప్పులేదని తెలుసుకున్న సన అతని దగ్గరకు వెళ్లి సారీ చెబుతుంది. అదే సమయంలో కారు స్టార్ట్ అవకపోవడంతో.. అలీరెజా తన కారులో ఆమెను ఇంటి దగ్గర దింపేందుకు తీసుకెళితే..

Sana: అందుకే అలీ రెజాతో రొమాంటిక్ సీన్ చేశా.. అలాంటివి ఇంకా చేయాలని ఉంది
Actress Sana about Metro Kathalu Romantic Scene

ఓటీటీలో విడుదలై అప్పట్లో బాగా వైరల్ అయిన వెబ్ సిరీస్ ‘మెట్రో కథలు’ (Metro Kathalu). తెలుగులో తెరకెక్కిన మొట్టమొదటి అంథాలజీ ఇది. ‘పలాస 1978’ (Palasa 1978) చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటిన కరుణకుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన నాలుగు కథల సమాహారమిది. ముఖ్యంగా ఈ అంథాలజీలో సన (Sana) ఎపిసోడ్‌కి సంబంధించి అప్పట్లో హాట్ హాట్ కామెంట్స్ వినిపించాయి. సన, అలీరెజా (Ali Reza) మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సీన్‌ (Romantic Scene)ని రియలిస్టిక్‌గా దర్శకుడు తెరకెక్కించాడు. ఈ రొమాంటిక్ సీన్‌‌లో సన చేయడంపై అప్పట్లో పెద్ద చర్చలే నడిచాయి. తాజాగా ఆ రొమాంటిక్ సీన్‌పై నటి సన ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. (Sana about Metro Kathalu Romantic Scene) ‘మెట్రో కథలు’లో నేను ఆ పాత్ర చేయడానికి కారణం దర్శకుడు కరుణ కుమార్ (Director Karuna Kumar), రైటర్ ఖాదీర్ బాబు. మిడిల్ క్లాస్ మహిళ ఎంత స్ట్రగుల్ అవుతుందనేది నా స్టోరీలో చూపించారు. తాగుబోతు భర్త.. భార్యని పట్టించుకోకపోతే.. ఆమె ఎలా ఫీలవుతుంటుంది? బయట జనం ఏం మాట్లాడుకుంటారు? అనేది చూపిస్తూ.. ఆమెకు ఇంటి బాధ్యతలతో పాటు.. లోపల కోరికలు కూడా ఉంటాయనేది చూపించారు. ఇది నిజ జీవితంలో చాలా మందికి ఎదురయ్యే సమస్యే. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాన్నే ఈ సిరీస్‌లో చూపించారు. నా పాత్రని చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారు. అందులో మంచి మెసేజ్ ఉంది. అదీ కాకుండా మంచి ప్రొడక్షన్ హౌస్. అందుకే ఆ పాత్ర చేయడానికి అంగీకరించాను. పాత్ర స్వభావాన్ని బట్టి.. తను కావాలని తప్పు చేయదు.. అనుకోకుండా అలా జరుగుతుంది. చిన్న వీక్ మూమెంట్‌లో చేసిన తప్పు అది. రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టే.. ఆ తప్పు నాకు నచ్చింది. అందుకే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నాను. మంచి మెసేజ్ ఉన్న ఆ పాత్రను చూసి ఇన్ స్పైర్ అవుతారనే ఆ రోల్ చేశాను. ఇలాంటి రియలిస్టిక్ స్టఫ్ ఉన్న రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను. ఆ పాత్రకు సంబంధించి అంతగా చర్చలు జరిగాయంటే.. అందులో విషయం ఉన్నట్టే కదా. నేను కూడా అదే ఫీలయ్యాను. అందుకే ఆ పాత్ర చేశానని సన చెప్పుకొచ్చింది. (Sana in Romantic Scene)

‘మెట్రో కథలు’ (Sana Story in Metro Kathalu) వెబ్ సిరీస్‌లో సన ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆమె ఇందులో గృహిణి పాత్రలో నటించింది. భర్త తాగుబోతు. అలీరెజా కారణంగా సన భర్తకు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెండ్ చేసిన అలీరెజా‌పై సీరియస్ అవుతూ అతని చెంప పగలగొడుతుంది. అయితే ఆ యాక్సిడెంట్‌లో అలీరెజా తప్పులేదని తెలుసుకున్న సన అతని దగ్గరకు వెళ్లి సారీ చెబుతుంది. అదే సమయంలో కారు స్టార్ట్ అవకపోవడంతో.. అలీరెజా తన కారులో ఆమెను ఇంటి దగ్గర దింపేందుకు తీసుకెళతాడు. ఈ మార్గమధ్యంలో సన తన బాధను అలీరెజాకు చెప్పుకుని అతనికి కాస్త దగ్గరవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య రొమాన్స్‌కు దారితీస్తుంది. ఇద్దరి మధ్య వచ్చే ఈ సన్నివేశాలను దర్శకుడు చాలా ఇంటెన్స్‌గా తెరకెక్కించారు. (Romantic Scene Between Sana and Ali Reza)

ఇవి కూడా చదవండి:

*********************************

*Upasana: ఉపాసన బేబీ బంప్ ఫొటో వైరల్.. ఇక డౌట్స్ వద్దమ్మా..!

*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

*Hyper Aadi: రికార్డులు అనేవి పుట్టిందే ఆయనను చూసి.. హైపర్ ఆది స్పీచ్ వైరల్

*Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

*Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-28T15:40:09+05:30 IST