Kalyan Ram: కల్యాణ్ రామ్‌కు ఉత్తమ నటుడి అవార్డ్

ABN , First Publish Date - 2023-03-24T19:53:55+05:30 IST

ఈ అవార్డుకు తనని ఎంపిక చేసిన వారందరికీ, సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అలాగే ఈ అవార్డుకు కారణమైన చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన

Kalyan Ram: కల్యాణ్ రామ్‌కు ఉత్తమ నటుడి అవార్డ్
Best Actor Award to Kalyan Ram

నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ‘బింబిసార’ (Bimbisara) చిత్రంలోని నటనకుగానూ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ (Sri Kala Sudha Telugu Association Film Awards 2023) ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం (Ugadi Puraskar) ఉగాది రోజు చెన్నై మ్యూజిక్ అకాడమీ‌లో వైభవంగా జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డును ‘బింబిసార’ చిత్రానికి‌గానూ నందమూరి కళ్యాణ్ రామ్ అందుకున్నారు. ఉత్తమ నటిగా సమంత (Samantha) ఎన్నికయ్యారు.

DVV-Danayya.jpg

అవార్డు అందుకున్న అనంతరం హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘మహా పురుషుడు NTR తెలుగువారి ఆరాధ్య దైవం. తాతలాంటి వారితో నన్ను పోల్చవద్దు. ఆయన స్థాయిని నేను చేరు కోలేను’’ అని పేర్కొన్నారు. ఈ అవార్డుకు తనని ఎంపిక చేసిన వారందరికీ, సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అలాగే ఈ అవార్డుకు కారణమైన చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డుల వేడుకలో స్వాగతోపాన్యాసం చేసిన సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ (Bethireddy Srinivas) తమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ గాయని పి.సుశీల, నిర్మాత మైత్రి రవి శంకర్, వ్యాపారవేత్త మువ్వా పద్మయ్య తదితరులు పాల్గొని ఉగాది సత్కారము స్వీకరించారు.

Sri-Kala-Sudha.jpg

శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కార గ్రహీతల వివరాలు:

ఉత్తమ నటుడు: నందమూరి కల్యాణ్ రామ్

ఉత్తమ నటి: సమంత

ఉత్తమ చిత్రం: బింబిసార (Bimbisara)

బాపు బొమ్మ పురస్కారం: నటీమణి ఈశ్వరీరావు

బాపు-రమణల పురస్కా రం: సినీదర్శకుడు హను రాఘవపూడి

Srilekha.jpg

లతా మంగేష్కర్ పురస్కారం: ఎమ్.ఎమ్. శ్రీలేఖ

వీఎస్ఆర్ స్వామి పురస్కారం: సినిమాటోగ్రఫర్ వంశీ పచ్చిపులుసు

ప్రముఖ వ్యాపారవేత్త వల్లేపల్లి శశికాంత్, సుభాష్ చంద్ర.. విశిష్ట అవార్డులను అందుకోగా.. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ ప్రధాన నిర్వాహకుడు రమేష్ జీవిత సాఫల్య పురస్కారాన్ని స్వీకరించారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-24T19:57:33+05:30 IST