Agent: ‘ది గాడ్’ గా డినో మోరియా.. లుక్ వైరల్

ABN , First Publish Date - 2023-04-14T12:31:34+05:30 IST

గురువారం ఈ చిత్రం నుంచి విడుదలైన రామాకృష్ణా లిరికల్ సాంగ్.. అంతకు ముందు విడుదలైన రెండు పాటల మాదిరిగానే మంచి స్పందనను రాబట్టుకుంటుండగా.. తాజాగా మేకర్స్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన

Agent: ‘ది గాడ్’ గా డినో మోరియా.. లుక్ వైరల్
Dino Morea As The God in Agent

హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni), స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్‌లో.. AK ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ‘ఏజెంట్’ (Agent). పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి విడుదలైన రామాకృష్ణా లిరికల్ సాంగ్.. అంతకు ముందు విడుదలైన రెండు పాటల మాదిరిగానే మంచి స్పందనను రాబట్టుకుంటుండగా.. తాజాగా మేకర్స్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన డినో మోరియా లుక్‌ను విడుదల చేశారు. (Dino Morea Look From Agent)

‘ఏజెంట్’ చిత్రం డినో మోరియా ‘ది గాడ్’ (The God) అంటూ అతని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రాజ్, అక్సర్, జూలీ మొదలైన చిత్రాలలో తన పాత్రలకు పేరుపొందిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా (Dino Morea). ఈ చిత్రంలో ఆయన ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించినట్లుగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ ఫస్ట్ లుక్‌లో చేతిలో మెషిన్ గన్‌తో డినో మోరియా కనిపిస్తున్నారు. అతని పొడవాటి జుట్టు, నెరిసిన గడ్డం, ముఖం మీద గాయాలు ఈ పాత్రను మరింత డెడ్లీగా ప్రజెంట్ చేస్తున్నాయి. ఈ లుక్ చూస్తుంటే ఈ సినిమాలో ఆయన విలన్ పాత్ర చేసినట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Agent Movie Latest update)

Akhil.jpg

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కథను అందించారు. ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో అఖిల్‌ని సురేందర్ రెడ్డి చూపించబోతున్నట్లుగా ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే తెలుస్తుంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌‌గా అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా, రసూల్ ఎల్లోర్ కెమెరామెన్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. ఏప్రిల్ 28న (Agent Release Date) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Vijay Deverakonda: ‘శాకుంతలం’ విడుదల వేళ.. సమంతకు విజయ్ బూస్ట్

*KGF Actress: ‘కెజియఫ్‌’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది

*Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?

*Brahmaji: ట్రైలర్ బాగుందా? అని అడిగిన సంయుక్తకు షాకింగ్ రిప్లయ్

*NTR 30: కొరటాల స్పీడ్ చూశారా.. అప్పుడే ఒకటి ఫినిష్..!

*Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు

*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

Updated Date - 2023-04-14T12:33:27+05:30 IST