All India NTR Fans: ‘సింహాద్రి’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం తప్ప.. స్వలాభం కోసం కాదు

ABN , First Publish Date - 2023-04-11T19:43:16+05:30 IST

‘సింహాద్రి 4K’ (Simhadri 4K) సినిమాకు సంబంధించి.. ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ (All India NTR Fans) తాజాగా ఓ విజ్ఞప్తి చేశారు. ‘సింహాద్రి’ సినిమాను రీ రిలీజ్ (Simhadri Re Release) చేయడానికి కారణం

All India NTR Fans: ‘సింహాద్రి’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం తప్ప.. స్వలాభం కోసం కాదు
NTR in Simhadri Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) పుట్టినరోజు (మే 20)ని పురస్కరించుకుని.. ఆయన నటించిన రెండు సినిమాలను రీ రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. అందులో రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సింహాద్రి’ (Simhadri) ఒకటి కాగా, రెండోది వి.వి. వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ (Aadi). ఈ రెండు చిత్రాలు ఎన్టీఆర్ బర్త్‌డేకి (NTR Birthday Special) థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే ‘సింహాద్రి 4K’ (Simhadri 4K) సినిమాకు సంబంధించి.. ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ (All India NTR Fans) తాజాగా ఓ విజ్ఞప్తి చేశారు. ‘సింహాద్రి’ సినిమాను రీ రిలీజ్ (Simhadri Re Release) చేయడానికి కారణం తెలుపుతూ.. స్వలాభం కోసమో లేదంటే వేరే ఉద్దేశంతోనో చేయడం లేదని వారు ఇందులో పేర్కొన్నారు.

Jr-NTR.jpg

ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో ఏముందంటే.. (ALL INDIA NTR FANS Request)

‘‘ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో 2003లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ సింహాద్రి చిత్రాన్ని ఈ సంవత్సరం మే 20వ తేదీన ఎన్టీఆర్‌గారి పుట్టినరోజుని పురస్కరించుకుని రీ రిలీజ్ చేస్తున్న విషయం అందరికీ విదితమే. అయితే ఈ ప్రెస్ నోట్ ద్వారా మీ అందరికీ ఒక స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాము.

సింహాద్రి చిత్రాన్ని థర్డ్ పార్టీ దగ్గర ఒక ఫ్యాన్సీ రేట్‌కు కొనుగోలు చేసి.. దానిని రీ రిలీజ్ చేసి మా అభిమాన హీరో ఎన్టీఆర్‌గారి పుట్టిన రోజుని చాలా ఘనంగా జరుపుకోవాలని సన్నాహాలు చేస్తున్నాము. ఈ రీ రిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్స్ ఫ్యాన్స్‌కే తిరిగి చేరాలనే ఉద్దేశంతో థర్డ్ పార్టీ దగ్గర చిత్ర రైట్స్ మేమే కొనుగోలు చేసి రీ రిలీజ్ చేస్తున్నాము.

Jr-NTR-2.jpg

దీని విషయమై ఎన్టీఆర్‌గారి అభిమానులు అలాగే స్టేట్ కన్వీనర్స్ అందరము కూడా మాట్లాడుకుని బయటవాళ్లకు ఈ రీ రిలీజ్ నుండి వచ్చే వసూళ్లు చేరకూడదు అనే ఉద్దేశంతో, చిత్రాన్ని మేమే రిలీజ్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చాము. ఇదే మాట మేము ఎన్టీఆర్‌గారికి కూడా చెప్పడం జరిగింది. చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నామని ఆయన కూడా ముందుకు వెళ్లమని చెప్పారు.

ఈ రీ రిలీజ్ కేవలం మా అభిమానులకు ఎంతో కొంత సాయంగా ఉండటానికే చేస్తున్నాం తప్ప.. మా స్వలాభం కోసమో, వేరే ఉద్దేశంతో చేస్తున్నది కాదు. ఇట్లు ఆల్ ఇండియా NTR Fans’’ అని చెప్పుకొచ్చారు. (NTR Fans Released Press Note)

NTR-Fans.jpg

ఇవి కూడా చదవండి:

*********************************

*Ram Charan and Upasana: మాల్దీవుల్లో ఉన్నా.. మరిచిపోలేదండోయ్..

*Allu Aravind: సాయిధరమ్ ఫోన్ చేస్తుంటే.. గీతా ఆర్ట్స్‌లో సినిమా అడుగుతాడనుకున్నా.. కానీ?

*Raghava Lawrence: రామ్ చరణ్‌లో నాకు నచ్చింది ఏమిటంటే..

*Samantha: నేను ఫేస్ చేసిన స‌మ‌స్య‌ల వ‌ల్లే.. ఇప్పుడిలా మారిపోయా!

*NTR 2 NTR: ‘ఆది’.. జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. మాస్ అప్‌డేట్

*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది

Updated Date - 2023-04-11T19:43:19+05:30 IST