సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Farzi: వెబ్‌సిరీస్‌ సీన్ రిపీట్.. రోడ్డుపై డబ్బుల వర్షం.. యూట్యూబర్ అరెస్ట్

ABN, First Publish Date - 2023-03-15T09:07:36+05:30

ఇటీవలే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ దర్శకద్వయం రాజ్, డీకే ‘ఫర్జీ’ (Farzi) అనే మరో వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Farzi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ దర్శకద్వయం రాజ్, డీకే ‘ఫర్జీ’ (Farzi) అనే మరో వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ (Shahid Kapoor), విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తరువాతి సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ వెబ్‌‌‌సిరీస్‌ని అనుకరిస్తూ ఓ యూట్యూబర్ (YouTuber) చేసిన ఫీట్ అతన్ని చిక్కుల్లో పడేసింది.

ఈ వెబ్‌సిరీస్‌లో షాహిద్ కపూర్ దొంగ నోట్లు ముద్రించే వ్యక్తిగా, విజయ్ సేతుపతి కాప్‌గా నటించారు. షాహిద్‌ని పట్టుకోడానికి సేతుపతి ఓ ప్లాన్ రెడీ చేస్తాడు. అది పసిగట్టిన షాహిద్ రోడ్డుపై దొంగనోట్లని విసిరేసి తప్పించుకుంటాడు. ఆ సీన్‌ని అచ్చం అలాగే.. ఢిల్లీకి చెందిన యూట్యూబర్ జోరావర్ సింగ్ కల్సి (Joravar Singh Kalsi) రిక్రియేట్ చేశాడు. కారులో ప్రయాణం చేస్తూ ఫేక్ నోట్స్‌ని రోడ్డుపైకి విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది.

అనంతరం ఈ వీడియో పోలీసుల వరకు చేరింది. దీంతో స్పీడ్ డ్రైవింగ్, అనుమతి లేకుండా, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి వీడియోలు చేసినందుకు ఆ యూట్యూబర్‌ని, అతని స్నేహితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 279, 336, 283 ప్రకారం ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసి విచారిస్తున్నారు. (Farzi webseries)

ఇవి కూడా చదవండి:

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Updated Date - 2023-03-15T09:16:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!