Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

ABN , First Publish Date - 2023-03-08T15:17:25+05:30 IST

షార్ట్ ఫిల్మ్స్‌తో మొదలై.. కమెడియన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటుడు సుహాస్ (Suhas).. ‘కలర్‌ ఫొటో’ చిత్రంతో హీరోగా మారిన సంగతి తెలిసిందే.

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Writer Padmabhushan

షార్ట్ ఫిల్మ్స్‌తో మొదలై.. కమెడియన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటుడు సుహాస్ (Suhas).. ‘కలర్‌ ఫొటో’ చిత్రంతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఓటీటీ (OTT)లో విడుదలైనప్పటికీ సూపర్ హిట్ టాక్ రావడంతో సుహాస్‌కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అయినప్పటికీ ఓ వైపు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూనే మరో హీరోగా సైతం బిజీగా ఉన్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ తాజాగా నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan).

ష‌ణ్ముఖ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదలై హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. సున్నితమైన కథగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అయితే.. ఈ మూవీని థియేటర్స్‌లో మిస్సయిన చాలామంది సినీ లవర్స్ ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. (Writer Padmabhushan OTT Streaming)

ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ జీ5 యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఉగాదికి ముందే పండగ కానుక ఇస్తున్నట్లు అందులో రాసుకొచ్చింది. టీనా శిల్పరాజ్ ఈ మూవీలో కథానాయికగా నటించగా.. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ కీలక పాత్రల్లో నటించారు. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలిమ్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్ర మనోహర్ నిర్మించిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. (Suhas Writer Padmabhushan)

ఇవి కూడా చదవండి:

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Updated Date - 2023-03-08T15:23:44+05:30 IST