Jawan: షారూఖ్ ఖాన్ సినిమా వాయిదా!

ABN , First Publish Date - 2023-03-15T18:54:35+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). చివరగా ‘పఠాన్’ (Pathaan) లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.

Jawan: షారూఖ్ ఖాన్ సినిమా వాయిదా!

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). చివరగా ‘పఠాన్’ (Pathaan) లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.1000కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ మూవీ ఇచ్చిన జోష్‌తో కింగ్ ఖాన్ వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ‘జవాన్’ (Jawan), ‘ఢంకీ’ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ‘జవాన్’ కు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 2న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఆ డేట్‌కు సినిమా వచ్చే అవకాశం లేదని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘జవాన్’ సినిమాను అంచనాలను మించేలా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా సమయాన్ని వెచ్చించాల్సి ఉంది. అందువల్ల సినిమాను నాలుగు నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని మేకర్స నిర్ణయించుకున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ‘జవాన్’ ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార, సాన్యా మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. షారూఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ ఛిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోంది. పాన్ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Updated Date - 2023-03-15T18:54:36+05:30 IST