Sara Ali Khan: నా జీవితం నా ఇష్టం.. ట్రోలర్స్‌కి సారా స్ట్రాంగ్ రిప్లై

ABN , First Publish Date - 2023-03-23T12:25:26+05:30 IST

బాలీవుడ్‌లో మంచి క్రేజీ ఉన్న హీరోయిన్లలో సారా అలీఖాన్ (Sara Ali Khan) ఒకరు.

Sara Ali Khan: నా జీవితం నా ఇష్టం.. ట్రోలర్స్‌కి సారా స్ట్రాంగ్ రిప్లై
Sara Ali Khan

బాలీవుడ్‌లో మంచి క్రేజీ ఉన్న హీరోయిన్లలో సారా అలీఖాన్ (Sara Ali Khan) ఒకరు. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), అమృతా సింగ్ (Amrutha Singh) వారసురాలిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం వరుసగా వరుస సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ కెరీర్‌లో దూసుకుపోతోంది. అయితే.. ఈ బ్యూటీకి శివుడు అంటే చాలా భక్తి. అందుకే వీలుకుదిరినప్పుడల్లా ముంబైలోని మహాదేవ్ గుడికి వెళ్లి వస్తూ ఉంటుంది. అయితే.. ఈ సమయంలో పలుమార్లు ఈ భామని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. ఓ ముస్లింవై ఉండి ఇలా చేస్తావా అంటూ పలువురు విమర్శలు చేశారు. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సారా స్పందించింది.

Sara2.jpg

సారా తాజాగా నటించిన చిత్రం ‘గ్యాస్‌లైట్’ (Gaslight). విక్రాంత్ మస్సే (Vikranth masse) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రచార జోరు పెంచింది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సారా మాట్లాడుతూ.. ట్రోలింగ్ చేసిన వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. (Sara Ali Khan to Trolls)

sara4.jpg

‘నా నటనపై ప్రేక్షకులకు ఫిర్యాదులు ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అభిమానుల కోసం నటిస్తాను. కాబట్టి అది నాకు కూడా సమస్య కావచ్చు. కానీ నా వ్యక్తిగత విషయాలు లేదా నా జీవనశైలితో ఎవరికైనా సమస్య ఉంటే మాత్రం నేను పట్టించుకోను’ అని గట్టిగా చెప్పుకొచ్చింది. (Sara Ali Khan to Trolls)

‘‘గ్యాస్‌లైట్’ లేదా ‘ఏ వతన్ మేరే వతన్‌’లో నేను స్వాతంత్ర్య సమరయోధురాలిగా నటిస్తున్నాను. అలాగే.. లక్ష్మణ్ ఉటేకర్ సినిమాలో ఇండోర్‌లో నివసించే పంజాబీ అమ్మాయిగా నేను నటిస్తున్నా. దాంతోపాటు హోమీ అదాజానియా అనే అర్బన్ స్టైల్ చిత్రంలో నటిస్తున్నా. ఈ చిత్రాల్లో నా పాత్రలన్నీ దేనికదే డిఫరెంట్‌గా ఉంటాయి. దానికి నేను గర్వపడుతున్నాను. మరే ఇతర కారణాల వల్ల నేను వర్క్ చేయాలని అనుకోవడం లేదు’ అని తెలిపింది. (Sara Ali Khan to Trolls)

ఇవి కూడా చదవండి:

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Updated Date - 2023-03-23T12:55:23+05:30 IST