Parineeti Chopra: ఆప్ ఎంపీతో డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన నటి!
ABN , First Publish Date - 2023-03-29T20:04:40+05:30 IST
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha)తో ఆమె డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha)తో ఆమె డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో రెండు సార్లు జంటగా వీరిద్దరు కనిపించడంతో ఆ వదంతులకు మరింత బలం చేకూరినట్లైంది. డేటింగ్ రూమర్స్‌పై పరిణీతి తాజాగా స్పందించారు. ముంబయి ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్స్‌కు ఆమె ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా డేటింగ్ రూమర్స్‌పై ఆమెను అడిగారు. అందుకు ఆమె సమాధానం ఇవ్వకుండా సిగ్గుపడుతూ వెళ్లిపోయారు. నవ్వూతూ బాయ్, గుడ్‌నైట్ అని చెబుతూ వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా (Sanjeev Arora) చేసిన ట్వీట్ వారి బంధాన్ని బలపరిచేలా ఉంది. ‘‘పరిణీతి, రాఘవ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. వారి బంధం ప్రేమ, ఆనందంతో నిండిపోవాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో డేటింగ్ రూమర్స్ నిజమేనని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రాఘవ్ చద్దా పంజాబ్ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పరిణీతి చోప్రా ఇషాక్ జాదే, కేసరి, సైనా వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పరిణీతి, రాఘవ్ చద్దా కలసి చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరికి మంచి పరిచయముంది. అనేక మంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు కలిశాయి. ఫలితంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అతి త్వరలోనే రోకా వేడుక జరగనుందని సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఇరు కుటుంబాల పెద్దలు చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్
SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ
Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!
Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?
Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..
SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్
Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..