సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nayanthara: షారుఖ్ ఖాన్ కోసం రూల్ బ్రేక్ చేస్తున్న నయన్?.. 16 ఏళ్ల తర్వాత మొదటిసారి అలా..

ABN, First Publish Date - 2023-03-27T13:48:33+05:30

సౌతిండియాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Nayanathara
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతిండియాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) సినిమా ‘చంద్రముఖి’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. వెంకటేశ్ మూవీ ‘లక్ష్మి’తో తెలుగులోనూ అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఓ వైపు సినీయర్ హీరోలు, మరో యువ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ తక్కువ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం ఓ పక్కా హీరోల పక్కన ఆడిపాడుతూనే.. మరో పక్కా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది.

అయితే.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ (Shah Rukh Khan)తో తమిళ యువ దర్శకుడు అట్లీ (Atlee) ‘జవాన్’ (Jawan) అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో నయన తార బాలీవుడ్‌‌ (Bollywood)కి పరిచయమవుతోంది. కాగా.. ఈ మూవీలో నయన్ క్యారెక్టర్ గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. స్టార్ అయిన తర్వాత నయనతార మోడ్రన్ దుస్తులలో చాలా తక్కువగా కనిపించింది. అందులోనూ బికినీ అయితే 2007లో ఒకసారి మాత్రమే ధరించింది. తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన ‘బిల్లా’ సినిమాలో నయనతార చివరిసారిగా బికినీ ధరించింది. అప్పటి నుంచి ఇక ఎప్పుడూ బికినీ ధరించకూడదనే నియమాన్ని పెట్టుకుంది. అలాగే.. సినిమాలు చేస్తూ వస్తోంది. (Nayanthara to worn bikini for Jawan)

అయితే.. దాదాపు 16 సంవత్సరాల తర్వాత తను పెట్టుకున్న రూల్‌ని నయన్ బ్రేక్ చేయనుందట. షారుఖ్ సినిమా ‘జవాన్’ కోసం బికినీ ధరించేందుకు ఈ భామ సిద్ధమయ్యిందట. చాలా ముఖ్యమైన సీన్ కోసం బికినీ ధరించేలా మూవీ టీం నయన్‌ని ఒప్పించిందట. కానీ.. ఈ న్యూస్‌పై ఆమె అభిమానులు మాత్రం సంతోషంగా లేరు. తమ అభిమాన నటి అలాంటివి మళ్లీ చేయదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రచారం ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. కాగా.. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని ఈ ఏడాది జూన్ 2న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Updated Date - 2023-03-27T13:50:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!