సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Deepika Padukone: మెడపై వేయించుకున్న ‘82°E’ టాటూకు అర్థమిదే!

ABN, First Publish Date - 2023-03-15T19:41:57+05:30

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) ఆస్కార్స్‌లో (Oscars 95) సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటను ప్రపంచానికి ఆమె పరిచయం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) ఆస్కార్స్‌లో (Oscars 95) సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటను ప్రపంచానికి ఆమె పరిచయం చేసింది. ఈ వేడుకలో ఆమె నలుపురంగు దుస్తులు ధరించి అందరిని ఆకట్టుకుంది. అయితే, ఆస్కార్స్‌లో దీపిక ధరించిన డ్రెస్‌తో పాటు ఆమె మెడపై ఉన్న టాటూ కూడా అందరిని ఆకర్షించింది. తన మెడపై ‘82°E’ అని ఉన్న టాటూ కనిపించేలా ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో నెటిజన్స్ ఆ పచ్చబొట్టుకు అర్థం ఏంటని నెట్టింట తెగ వెతుకుతున్నారు.

దీపిక కొత్తగా ‘82 డిగ్రీస్‌ ఈస్ట్‌’ అనే పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్‌ను మొదలుపెట్టింది. ఈ పేరుతో గత కొన్ని నెలలుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. దీపిక తన సొంత బ్రాండ్‌ పేరునే పచ్చబొట్టు వేయించుకుంది. ఇది చూసిన నెటిజన్స్ దీపికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలు కామెంట్స్ పెడుతున్నారు.

దీపికా పదుకొణె కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ‘పఠాన్’ (Pathaan) లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1000కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఆమె తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ‘ప్రాజెక్ట్ కె’ (Project K) లో హీరోయిన్ పాత్రను పోషిస్తుంది. హృతిక్ రోషన్‌కు జోడీగా ‘ఫైటర్’ (Fighter) లోను కనిపించనుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Updated Date - 2023-03-15T19:41:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!