సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nita Ambani: అట్టహాసంగా మొదలైన నీతా అంబానీ కలల ప్రాజెక్ట్.. తరలివచ్చిన తారాలోకం!

ABN, First Publish Date - 2023-04-01T09:52:27+05:30

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా.. అంబానీ తలచుకుంటే తారాలోకం దిగిరావాల్సిందే. ముంబైలో జరిగిన ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) సతీమణి నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్టు

Mukesh Ambani with His Wife and Rajinikanth with His Daughter
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా.. అంబానీ తలచుకుంటే తారాలోకం దిగిరావాల్సిందే. ముంబైలో జరిగిన ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) సతీమణి నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో అదే జరిగింది. తారాలోకం మొత్తం ముంబైలో వాలిపోయింది. నీతా అంబానీ కలల ప్రాజెక్టు అయిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్‌ (Nita Mukesh Ambani Cultural Centre) సెంటర్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రాజకీయ, క్రీడ, సినీ, పారిశ్రామికవేత్తలెందరో తరలివచ్చారు. శ్రీరామనవమి (Srirama Navami) పండగ సందర్భంగా నీతా అంబానీ ఒక రోజు ముందే ఈ కల్చరల్ సెంటర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా.. శుక్రవారం ఈ కల్చరల్‌ సెంటర్‌ను అధికారికంగా అట్టహాసంగా ప్రారంభించారు. దేశ కళారంగాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయ కళలను ప్రోత్సహించడంలో భాగంగా ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సౌత్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) తన కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ (Soundarya Rajnikanth)తో కలిసి హాజరయ్యారు. ఇక బాలీవుడ్ తారలైన అమీర్ ఖాన్ (Aamir Khan), సల్మాన్ ఖాన్ (Salman Khan), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai), అనుపమ్ ఖేర్, విద్యాబాలన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే (Deepika Padukone), ప్రియాంక చోప్రా-నిక్‌జోనస్‌, వరుణ్ ధావన్, సోనమ్ కపూర్, జావేద్ అక్తర్, షబానా అజ్మీ, సునీల్ శెట్టి, షాహిద్ కపూర్, అలియా భట్ (Alia Bhatt), దియా మీర్జా, శ్రద్ధా కపూర్, రాజు హిరానీ, తుషార్ కపూర్ వంటి వారెందరో కలర్ ఫుల్ డ్రస్సులో కనిపించి ఆకర్షించారు.

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) తన సతీమణి అంజలి, కూతురు సారా (Sara) టెండూల్కర్‌‌తో కలిసి వచ్చి.. ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అలాగే ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా, స్టార్ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా, అథ్లెట్ దీపా మాలిక్ వంటివారితో పాటు హాలీవుడ్‌కు చెందిన నటీనటులు స్పైడర్‌ మ్యాన్‌ ఫేమ్‌ టామ్‌ హోలాండ్‌, జెండయా సైతం హాజరై ఆశ్చర్యపరిచారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రిలయన్స్‌ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ, ఆమె కుమార్తె ఇషా అంబానీ (Isha Ambani) హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఈ కల్చరల్ సెంటర్‌కు వచ్చిన, వస్తున్న ఆదరణ చూసి నేను ముగ్ధురాలునయ్యాను. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ సాంస్కృతిక కేంద్రాల్లో ఒకటి. కళలు, కళాకారులందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ సెంటర్‌లో చిన్న చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాల వారు కూడా తమ కళలను ప్రదర్శించవచ్చు. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదర్శనలు ఈ సెంటర్‌కు వస్తాయని ఆశిస్తున్నాను’’ అని అంటే..

ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఇది ముంబైకే కాదు.. దేశం మొత్తానికి ప్రధాన కళా కేంద్రంగా ఆవిర్భవిస్తుందని భావిస్తున్నా’’నని పేర్కొన్నారు. కాగా, ఈ కల్చరల్ సెంటర్‌ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 23 వరకు జరగనుంది. (Nita Mukesh Ambani Cultural Centre Launch)

ఇవి కూడా చదవండి:

*********************************

*Pooja Hegde: కుందనపు బొమ్మలా.. బతుకమ్మ పాటలో గోపికమ్మ!

*Shaakuntalam: ‘మల్లికా మల్లికా’ వీడియో సాంగ్‌.. అబ్బ ఏముందిరా బాబు సమంత!

*Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?

*Allu Arjun: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి బన్నీ రాలేదని ట్రోల్ చేశారుగా.. ఈ విషయం తెలిస్తే?

*Poonam Kaur: ఫైట్ చేయగలను.. డ్యాన్స్ చేయగలనంటూ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే..

*Sarath Babu: హాస్పిటల్‌లో నటుడు శరత్ బాబు.. అసలేమైంది?

*Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

Updated Date - 2023-04-01T09:52:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!