సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ajay Devgn: నా వల్లే ‘నాటు నాటు’కి ఆస్కార్ వచ్చింది

ABN, First Publish Date - 2023-03-25T09:53:22+05:30

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) ఒకరు. ముఖ్యంగా సినిమాల్లో ఆయన చేసే స్టంట్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.

RRR
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) ఒకరు. ముఖ్యంగా సినిమాల్లో ఆయన చేసే స్టంట్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ స్టార్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీతో ఆయనకి సౌతిండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట ‘బెస్ట్ ఓరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్స్ అవార్డు గెలుచుకుంది. దీంతో ఎస్‌ఎస్ రాజమౌళితో పాటు ఈ మూవీ టీంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా దీనిపై అజయ్ దేవగణ్ కూడా స్పందించాడు.

అజయ్ తాజాగా నటించిన చిత్రం ‘భోళా’ (Bhola). తమిళ హీరో కార్తీ, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబో తెరకెక్కిన ‘ఖైదీ’ మూవీకి ఇది రిమేక్. ఈ సినిమాలో టబు (Tabu) ఓ కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రం మార్చి 30న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ టీం ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా సాగిస్తోంది. అందులో భాగంగా.. ప్రముఖ కామెడీ రియాలిటీ షో ‘ది కపిల్ శర్మ షో’కి అజయ్, టబు అతిథులుగా వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో.. ‘నాటు నాటు’కి ఆస్కార్ రావడం గురించి హోస్ట్ కపిల్ శర్మ ప్రశ్నించాడు. దానికి.. ‘నా వల్లే ఆర్ఆర్ఆర్‌కి ఆస్కార్ వచ్చింది’ అని అజయ్ బదులిచ్చాడు. అది విన్న కపిల్ షాకై.. అదేలా అని అడిగగా.. ‘ఆ పాటకి నేను డ్యాన్స్ చేస్తే పరిస్థితి ఎంటీ?’ అని ఆ స్టార్ తనదైన శైలిలో ఫన్నీగా వ్యాఖ్యానించాడు.

ఈ వైరల్ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. ‘అజయ్ సర్ కపిల్ శర్మ షోకి వచ్చినప్పుడల్లా, అది బెస్ట్ ఎపిసోడ్‌ అవుతుంది’.. ‘ఈ ఎపిసోడ్‌లో డార్లింగ్ టబు, అజయ్‌ని చూడటానికి ఎదురుచూస్తున్నాం’ అంటూ రాసుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

Updated Date - 2023-03-25T10:48:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!