సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kangana Ranaut: దేశ కీర్తి ప్రతిష్ఠలను దీపిక భుజాలపై మోసింది

ABN, First Publish Date - 2023-03-13T15:26:10+05:30

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె (Deepika Padukone) ఒకరు. భారత ఖ్యాతిని ఆమె ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఫిఫా వరల్డ్ కప్‌ ట్రోపీని ఆవిష్కరించారు. తాజాగా ఆస్కార్స్‌లోను సందడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె (Deepika Padukone) ఒకరు. భారత ఖ్యాతిని ఆమె ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఫిఫా వరల్డ్ కప్‌ ట్రోపీని ఆవిష్కరించారు. తాజాగా ఆస్కార్స్‌లోను సందడి చేశారు. అకాడమీ అవార్డ్స్‌లో ‘నాటు నాటు’ సాంగ్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. అంతర్జాతీయ వేదికపై పాల్గొనే అవకాశం రావడంతో దీపికకు అనుకోని అతిథి నుంచి సర్‌ప్రైజ్ ఎదురయింది. దీపికను ప్రశంసిస్తూ కంగనా రనౌత్ (Kangana Ranaut) సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.‘‘దేశం మొత్తాన్ని ఏకతాటిపై ఉంచి అక్కడ పాల్గొనడం అంత సులభం కాదు. దేశ కీర్తి, ప్రతిష్ఠలను భుజాలపై మోస్తూ దీపిక పదుకొణె ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతుంటే ఆమెను చూడటం అద్భుతంగా ఉంది. భారతీయ మహిళలు గొప్పవారని చెప్పడానికి ఆమె సాక్ష్యం’’ అని కంగనా రనౌత్ తెలిపారు.

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డును గెలుపొందడంతో చిత్ర బృందానికి కూడా కంగన శుభాకాంక్షలు చెప్పారు. ‘‘జాతి ప్రాతిపదికన భారతీయులను అణచివేసిన, హింసించిన, వలసరాజ్యానికి సంబంధించిన సినిమా ప్రపంచ వేదికపై ప్రశంసలు అందుకుంది. ఊచకోతకు గురైన యూదుల కంటే బెంగాల్ కరవు సమయంలో మరణించిన భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు ధన్యవాదాలు’’ అని కంగన చెప్పారు. ఇక ఆస్కార్స్ విషయానికి వస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరిలో పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఈ సాంగ్‌కు ఎమ్ ఎమ్.కీరవాణి మ్యూజిక్ అందించారు. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అలపించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^


ఇవి కూడా చదవండి:

Sharon Stone: శృంగార చిత్రం చేయడంతో నా కుమారుడు దూరమయ్యాడు

Comedian Raghu: జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్.. ఆయన జోలికేస్తే ప్రాణాలు తీస్తా..

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-13T15:26:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!