Ashneer Grover: థియేటర్స్‌కి ఎవరూ వెళ్లట్లేదు.. ఈ అవకాశాన్ని వాడుకోండి.. విద్యార్థులకి బిజినెస్‌మేన్ క్రేజీ సలహా

ABN , First Publish Date - 2023-03-25T14:02:06+05:30 IST

ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ భారత్ పే (BharatPe)కి మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌ (Ashneer Grover)కి ఉన్న పాపులారిటీ తెలిసిందే.

Ashneer Grover: థియేటర్స్‌కి ఎవరూ వెళ్లట్లేదు.. ఈ అవకాశాన్ని వాడుకోండి.. విద్యార్థులకి బిజినెస్‌మేన్ క్రేజీ సలహా
Ashneer Grover

ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ భారత్ పే (BharatPe)కి మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌ (Ashneer Grover)కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. రియాలిటీ టీవీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ (Shark Tank India) సీజన్ 1లో పెట్టుబడిదారుడిగా కనిపించిన తర్వాత ఆయన క్రేజ్ భారీగా పెరిగింది. ఆ షోలో ఎంతో నిక్కచ్చిగా ఉండే ఆయన స్వభావానికి ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆయనకి సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ పెరిగిపోయారు. అంతేకాకుండా.. ఆయన పలు కాలేజీ ఫెస్ట్‌లకి గెస్ట్‌గా వెళ్లి విద్యార్థుల కెరీర్‌కి సంబంధించి ప్రసంగాలు ఇస్తుంటారు. ఆయన తాజాగా ఘజియాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెనేజ్‌మేంట్ టెక్నాలజీకి అతిథిగా వెళ్లారు. అక్కడ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ భవిష్యత్తు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అష్నీర్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతకాలంలో, నీకంటూ బ్రాండ్‌ని క్రియేట్ చేసుకునే అవకాశం పెరిగింది. ఇంతకుముందు, యష్ రాజ్‌ (Yash Raj)కి మాత్రమే కెమెరా ఉండేది. ఆయన తన సినిమా కోసం కొందరినీ తీసుకునేవారు. ఆయన కెమెరా ముందు నిలబెట్టినవారే హీరో అయ్యేవారు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఉంది. కాబట్టి మన ఎదుగుదలకి ఇంకా ఓ యష్ రాజ్ అవసరమా?’ అని చెప్పుకొచ్చాడు.

Ashneer.jpg

అష్నీర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈరోజుల్లో ఎవరూ థియేటర్‌కి వెళ్లాలని అనుకోట్లేదు. థియేటర్లు నిండడం చాలా కష్టమవుతోంది. నేను ఇంట్లోనో, ఆఫీసులోనో, కారులోనో కూర్చున్నాని, తమ అనుకూలమైన సమయంలో వినోదాన్ని కోరుకుంటున్నారు. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బ్రాండ్‌గా మారొచ్చు’ అని తెలిపారు.

కాగా.. యశ్ రాజ్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే.. గతేడాది ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచాయి. 2022 సంవత్సర మొత్తం ఆ సంస్థకి గడ్డుకాలంగా నిలిచింది. అయితే.. ఈ ఏడాది మాత్రం ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ‘పఠాన్’ హిట్‌గా నిలిచి రికార్డులను తిరగరాసింది. అలాగే.. ‘తూ ఝాతీ మై మక్కర్’ కూడా హిట్‌గా నిలిచి మంచి వసూళ్లని రాబట్టాయి.

ఇవి కూడా చదవండి:

LEO Video Viral: సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో.

Updated Date - 2023-03-25T14:09:08+05:30 IST