సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Amitabh Bachchan: గాయం నుంచి కోలుకున్న మెగాస్టార్.. ఇక యాక్షన్ షురూ..

ABN, First Publish Date - 2023-03-21T12:10:55+05:30

‘ప్రాజెక్ట్ కే’ సినిమా షూటింగ్‌ సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) గాయపడిన విషయం తెలిసిందే.

Amitabh Bachchan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ప్రాజెక్ట్ కే’ సినిమా షూటింగ్‌ సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి బిగ్ బీ కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తాజాగా తెలియజేశారు. అంతేకాకుండా.. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే షూటింగ్‌లో తిరిగి పాల్గొననున్నట్లు అమితాబ్ చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు ఎప్పటిలా ఉత్సాహంగా ఉండాలి’, ‘గ్రేట్‌ న్యూస్‌’, ‘షెహన్‌షా వచ్చేశాడు’ అంటూ ఆయన కామెంట్లు చేస్తున్నారు.

నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ (Project K) మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ తరుణంలో మార్చి మొదటి వారంలో మూవీ టీం ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించింది. ఈ సందర్భంలో అమితాబ్ కుడివైపు పక్కటెముకలకు దెబ్బ తగిలింది. దీంతో చిత్రబృందం ఆయన్ని వెంటనే హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ముంబయిలోని తన నివాసానికి వెళ్లిన ఆయన అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు.

అలాగే.. తనకి జరిగిన ప్రమాదం గురించి అమితాబే స్వయంగా తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు అందులో తెలిపారు. ఏం జరిగినా బాధ పడకుండా దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తానని ఆయన ఆ బ్లాగ్‌లో చెప్పుకొచ్చారు. కాగా.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ప్రాజెక్ట్ కే’లో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా.. అమితాబ్‌ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి:

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Updated Date - 2023-03-21T12:14:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!