Lenin: ‘సోల్ ఆఫ్ లెనిన్’.. రణమే జరపరా!

ABN, Publish Date - Jun 05 , 2026 | 04:54 PM

అఖిల్ అక్కినేని కెరీర్‌లో సరికొత్త రగ్గడ్, మాస్ మేకోవర్‌తో రాబోతోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీ నుంచి ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కెరీర్‌లో సరికొత్త రగ్గడ్, మాస్ మేకోవర్‌తో రాబోతోన్న చిత్రం ‘లెనిన్’ (Lenin Movie). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన కంటెంట్, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ సోల్‌ని.. ‘సోల్ ఆఫ్ లెనిన్’ (Soul of Lenin) పేరుతో వీడియోను విడుదల చేశారు. 2 నిమిషాల 20 సెకన్ల నిడివి గల ఈ సాంగ్.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తూ.. సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. ఈ సాంగ్ ఎలా ఉందంటే..


ఈ సాంగ్‌లో అఖిల్ అక్కినేని లుక్ సరికొత్తగా ఉంది. గడ్డం, జుట్టు పెంచి ఇంటెన్స్, రగ్గడ్ అవతారంలో కనిపించారు. ఆయన కళ్ళల్లో చూపించిన రౌద్రం, యాక్షన్ సీక్వెన్స్‌లలో చూపించిన ఈజ్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఈ వీడియో చాలా ట్రెడిషనల్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించింది. ఒకవైపు ఎమోషన్, మరోవైపు యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది.


థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు ప్రాణం పోసింది. ఒక వైపు వినిపించే శ్లోకాలు, మరోవైపు యాక్షన్ సీన్స్‌కు ఇచ్చిన హెవీ బేస్ మ్యూజిక్ టీజర్ యొక్క మూడ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటకు సాహిత్యం అందించగా.. థమన్, కుమార వాగ్దేవి ఆలపించారు. పాట ముగిసిన తర్వాత కూడా వాగ్దేవి వాయిస్ హంట్ చేస్తుందంటే.. ఈ పాట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి గ్రామీణ నేపథ్యంలో ఒక వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథను సెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూపించిన ఫైట్ సీన్స్, నిప్పుల బ్యాక్‌డ్రాప్, చేజింగ్ షాట్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. జూన్ 26న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

‘డ్రాగన్’లోని ఆ సంచనాల కోసం వెయిటింగ్ -ఎన్టీఆర్

త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్‌

Updated at - Jun 05 , 2026 | 04:54 PM