Lenin: రెండోసారి శ్రీలీల లక్ ను లాగేసిన భాగ్యశ్రీ..
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:21 PM
ఒక సినిమాలో ఈ పాత్ర చేయాలన్నా రాసిపెట్టి ఉంటుంది అని చెప్పొచ్చు. మొదట సినిమా అనుకున్నప్పుడు నటీనటులు ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం కాదు
Lenin: ఒక సినిమాలో ఈ పాత్ర చేయాలన్నా రాసిపెట్టి ఉంటుంది అని చెప్పొచ్చు. మొదట సినిమా అనుకున్నప్పుడు నటీనటులు ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం కాదు, చివరకు రిలీజ్ అయ్యాక ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం. సగం సినిమా అయ్యాకా నటీనటులు ఛేంజ్ అయ్యిన దాఖలాలు కూడా టాలీవుడ్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు లెనిన్ (Lenin) సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అక్కినేని అఖిల్ (Akkinni Akhil) హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishore Abburu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ బ్యానర్స్ పై అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నిర్మిస్తున్నాడు.
ఇక అఖిల్ సరసన శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ రిలీజ్ వీడియో సెన్సేషన్ గా మారిన విషయం తెల్సిందే. ఎన్నో ఏళ్ళుగా అయ్యగారు ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్న అఖిల్.. ఆ తరువాత ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఇక ఈసారి అలా కాకూడదని నాగ్.. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి కిరణ్ అబ్బవరం కు వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ మురళీ కిషోర్ ను లైన్లో పెట్టాడు.
ఇక అఖిల్ కూడా ఈ సినిమా కోసం లుక్ మొత్తం మార్చేశాడు. మొదటిసారి ఊర మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు. అందులోనూ శ్రీలీల కూడా అయ్యగారితో జతకట్టడంతో ఇద్దరి జంట బావుందని, కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని పాజిటివ్ వైబ్ తెచ్చుకుంది. పరువు హత్యల నేపథ్యంలో లెనిన్ తెరకెక్కుతోందని తెలిసి ప్రేక్షకులు మరింత హైప్ పెట్టుకున్నారు. ఇక ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఈ చిత్రం నుంచి శ్రీలీల అవుట్ అవ్వడం అభిమానులను షాక్ కు గురిచేసింది. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక శ్రీలీల ఈ సినిమా తప్పుకుందని తెలుస్తోంది.
అయితే శ్రీలీల తప్పకుందా.. ? తప్పించారా.. ? అనేది తెలియదు కానీ, అమ్మడు అవకాశాలన్నింటినీ లాగేసుకుంటుంది మరో హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే కుర్రకారు దృష్టిలో పడింది. ఆ తరువాత కింగ్ డమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక కింగ్ డమ్ లో కూడా మొదట విజయ్ దేవరకొండ సరసన శ్రీలీలనే నటించాల్సి ఉంది. కొన్ని కారణాల వలన ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ భాగ్యశ్రీ తన్నుకుపోయింది. ఇక ఇప్పుడు రెండోసారి కూడా శ్రీలీల లక్ ను భాగ్యశ్రీనే లాగేసుకుంది.
అందుతున్న సమాచారం ప్రకారం లెనిన్ సినిమాలో శ్రీలీల డ్రాప్ అవ్వడంతో ఆ ప్లేస్ లో భాగ్యశ్రీని తీసుకున్నారని తెలుస్తోంది. నిజంగా ఈ రెండు సినిమాలు శ్రీలీలకు మంచి పేరు తీసుకొచ్చేవని చెప్పొచ్చు. కింగ్ డమ్, లెనిన్ సినిమాలు కథ పరంగా మంచి సినిమాలు.ధమాకా తరువాత అంతటి హిట్ అందుకోలేక బాధపడుతున్న శ్రీలీల.. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకదాని ద్వారా హిట్ ట్రాక్ ఎక్కేది ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ, ఈ చిన్నది మాత్రం ఆ లక్ ను చేజేతులారా భాగ్యశ్రీకి ఇచ్చినట్లు అయ్యింది. అందుకే పండే ప్రతి గింజపైన తినేవాడి పేరు ఉన్నట్లే.. సినిమాలో నటించే ప్రతి పాత్రపై నటించేవారి పేరు ముందే రాసి ఉంటుందట. ఏదిఏమైనా భాగ్యశ్రీ మాత్రం మంచి కథలను ఎంచుకొని దూసుకుపోతుంది.