Rapid Chitram: నానికి హీరోయిన్‌గా రుక్మిణీ.. రణబాలి కోసం విజయ్-రష్మిక..

ABN, Publish Date - Oct 14 , 2026 | 04:41 PM

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక.

నేచురల్ స్టార్ నాని, ‘96’ డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ కాంబోలో రానున్న కొత్త లవ్‌స్టోరీలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను నడిపించే బలమైన రోల్‌లో ఈ బ్యూటీ నటించనుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కొత్త జంట విజయ్ దేవరకొండ, రశ్మిక తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. ‘రణబాలి’ సినిమా విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు ‘ఆయ్’ డైరెక్టర్ అంజిబాబు కంచిపల్లి ఓ వినోదాత్మక కథను వినిపించినట్లు టాక్. దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో వరుణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం వరుణ్ నటిస్తున్న ‘బరి’ మూవీ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్ళనుందని టాక్. ప్రముఖ బుర్రకథ కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమాపై హైప్ పెంచేందుకు జోరుగా ప్రచారం చేస్తున్న చిత్రబృందం.. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించి మూవీ విశేషాలను పంచుకుంది.. ఇంకా ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

సెట్‌లో ప్రమాదం.. ఇమ్రాన్ హష్మీకి తప్పిన ప్రాణాపాయం

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాల విడుదల వాయిదా

RC17: కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి

Updated at - Oct 14 , 2026 | 04:41 PM