Rapid Chitram: ప్రపంచ సినిమా సమాచార మాలిక

ABN, Publish Date - Aug 20 , 2026 | 03:22 PM

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక.

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రానున్న మూవీలో హీరోయిన్‌గా సారా అర్జున్ పేరును పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ‘ఆర్సీ 17’ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘బఘీరా’ కన్నుమూసింది. నాలుగేళ్ళుగా తమ కుటుంబంలో భాగమైన బఘీరాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. అంతేకాక పెట్ డాగ్‌ను ప్రేమగా హగ్ చేసుకున్న ఫోటోలను పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై మళ్ళీ ప్రచారం వేడెక్కింది. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడంతో దర్శకుడు వశిష్ఠ లైన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. విజయదశమికి ఈ కాంబోలో రానున్న చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

మరోసారి అసూయ చాటుకున్న సిద్ధార్థ్‌ ఆనంద్!

Nagarjuna: ఆ సినిమా చేయడమే నేను తీసుకున్న సాహసోపేత నిర్ణయం

Sanjjanaa Galrani: విజయ్.. త్రిష.. సంజన గల్రానీ షాకింగ్ కామెంట్స్!

Updated at - Aug 20 , 2026 | 03:22 PM