Rapid Chitram: చిరంజీవి ‘కాకా’, గరివిడి లక్ష్మి, తేజ సజ్జా ‘ద ట్రేటర్స్’ లేటెస్ట్ అప్డేట్స్

ABN, Publish Date - Oct 07 , 2026 | 03:09 PM

తెలుగు సినిమా రంగంతో పాటు ఇతర భాషా చిత్రాలకు సంబంధించిన సినీ సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. మరెందుకు ఆలస్యం.. తాజా సినీ అప్డేట్స్ ఏంటో తెలుసుకోండి.

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘కాకా’ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పవర్ ఫుల్ విలన్‌‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో బాబీ ఆయనకు సీన్ వివరిస్తున్న వర్కింగ్ స్టిల్‌‌ను మేకర్స్ పంచుకున్నారు. భారీ అంచనాలున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జనవరి 13న విడుదల కానుంది. ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి జీవిత కథ ఆధారంగా గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గరివిడి లక్ష్మి’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైండ్ గేమ్‌ల ఆధారంగా సాగే అంతర్జాతీయ సూపర్ హిట్ సిరీస్ ‘ద ట్రేటర్స్’ తెలుగు వెర్షన్‌లో రానుంది. కుర్రహీరో తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ షో కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఒక భవంతిలో 20 మంది సెలబ్రిటీల నడుమ సాగే ఎత్తులు, పైఎత్తుల ఈ రహస్య పోరు అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

మళ్లీ తల్లి కాబోతోన్న కియారా అద్వానీ.. ఫొటోతో గుడ్‌న్యూస్

మండాడి సంచలన రికార్డు.. సుహాస్, సూరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్

అభిమాని హ‌త్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్

Updated at - Oct 07 , 2026 | 03:09 PM