Rapid Chitram: ‘జైలర్ 2’ సక్సెస్.. ‘ఆకాశంలో ఒక తార’ టీజర్.. మరిన్ని అప్డేట్స్
ABN, Publish Date - Oct 18 , 2026 | 09:05 PM
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!
రజనీకాంత్, నెల్సన్ కాంబోలో వచ్చిన ‘జైలర్ 2’ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో ఫుల్ ఖుషీ అయిన మేకర్స్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దుల్కర్ సల్మాన్ , పవన్ సాధినేని కాంబోలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. శ్రుతి హాసన్, సాత్విక వీరవల్లి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం నవంబర్ 20న విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ దర్శకుడు విక్రమ్.కె.కుమార్‌తో ఒక క్యూట్ లవ్ స్టోరీ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. విక్రమ్ చెప్పిన యూనిక్ లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న ‘స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ పూర్తయింది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో టబు, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.. ఇంకా ఇలాంటి సినీ సమాచారం కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
ముంబైలో సంచలనం.. హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ఆ గ్యాంగ్ పనేనా?
‘కల్ట్’ ట్రైలర్ రివ్యూ: నెత్తురోడే యాక్షన్.. ఒళ్లు గగుర్పొడిచే వయొలెన్స్
తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్.. ఆ లిస్ట్‌లోకి చేరిన దర్శకుడు
Updated at - Oct 18 , 2026 | 09:05 PM