ఎట్టకేలకు సంబరాల యేటి గట్టుని పూర్తి చేసిన మెగా మేనల్లుడు
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:01 PM
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej).. విరూపాక్ష లాంటి భారీ విజయం తరువాత రెండు సినిమాలను మొదలుపెట్టాడు. అందులో ఒక సినిమా ఆగిపోయింది.
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej).. విరూపాక్ష లాంటి భారీ విజయం తరువాత రెండు సినిమాలను మొదలుపెట్టాడు. అందులో ఒక సినిమా ఆగిపోయింది. రెండో సినిమా సంబరాల యేటిగట్టు (Sambarala Yetigattu). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తోంది. ఏ ముహూర్తన ఈ సినిమాని మొదలుపెట్టారో కానీ, వాయిదాల మీద వాయిదాలు.. రీషూట్స్ అంటూ నడుస్తూనే ఉంది.
ఇక ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన షూటింగ్ రాప్ అప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాదాపు 160 రోజులకు పైగా సుదీర్ఘంగా సాగిన ఈ భారీ షూటింగ్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసింది. 10కి పైగా మాసివ్ షెడ్యూల్స్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేశారు. విడుదల చేసిన మేకింగ్ వీడియోలో సాయి దుర్గా తేజ్ సరికొత్త రగ్గడ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన వాడే ఆయుధాలు, భారీ సెటప్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి.
కథాబలం ఉన్న మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టెక్నికల్ వాల్యూస్‌తో పాటు హై-వోల్టేజ్ యాక్షన్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తోన్న మెగా మేనల్లుడు సంక్రాంతి విన్నర్ గా నిలుస్తాడో లేదో చూడాలి.