తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్.. ఆ లిస్ట్‌లోకి చేరిన దర్శకుడు

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:11 PM

టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే తిరుగులేని విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రేక్షకులు, సినీ విమర్శకుల దృష్టిని ఆకర్షించడం కొందరి దర్శకులకే సాధ్యమవుతుంది. ఇప్పుడీ లిస్ట్‌లోకి మరో దర్శకుడు కూడా చేరారు.

Director Janakiram Marella

టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే తిరుగులేని విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రేక్షకులు, సినీ విమర్శకుల దృష్టిని ఆకర్షించడం కొందరి దర్శకులకే సాధ్యమవుతుంది. ఇప్పుడీ లిస్ట్‌లోకి మరో దర్శకుడు కూడా చేరారు. టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan)తో ఆ అరుదైన ఘనతను సాధించి తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు దర్శకుడు జానకిరామ్ మారెళ్ల (Janakiram Marella). కథలో వినోదానికి పెద్దపీట వేస్తూ, సందర్భానుసారంగా పేలే పంచ్ డైలాగులు, సహజసిద్ధమైన సంభాషణలతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించారు. భారీ హాస్య సన్నివేశాలపై ఆధారపడకుండా సాధారణ పరిస్థితుల నుంచే హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను రాబట్టడంలో ఆయన శైలి సినీ ప్రియులను ఎంతగానో కట్టిపడేసింది.


కేవలం కామెడీ మాత్రమే కాకుండా, కమర్షియల్ యాక్షన్ అంశాలను కూడా ఆయన తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తన గురువు, స్టార్ డైరెక్టర్ బాబీ తరహాలోనే యాక్షన్ సన్నివేశాలను అత్యంత రిచ్‌గా, అదిరిపోయే విజువల్స్‌తో డిజైన్ చేసి తనలోని టేకింగ్ స్కిల్స్‌ను ఘనంగా నిరూపించుకున్నారు. ఒకవైపు నవ్వులు పంచుతూనే, మరోవైపు మాస్ యాక్షన్ సీన్లతో థియేటర్లలో జోష్ నింపడం ద్వారా కామెడీ, యాక్షన్ రెండింటినీ సమతూకంలో బ్యాలెన్స్ చేస్తూ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను వెండితెరపై ఆవిష్కరించడంలో సంపూర్ణ విజయం సాధించారు.


Sree-Vishnu.jpg

తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంలో తనకున్న పట్టును ప్రూవ్ చేసుకున్న జానకిరామ్ మారెళ్ల.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ గ్రాండ్ సక్సెస్‌తో టాలీవుడ్‌లో సరికొత్త ప్రామిసింగ్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇదే వైవిధ్యాన్ని, కథా బలాన్ని కొనసాగిస్తే ఆయన భవిష్యత్తులో మరిన్ని క్రేజీ చిత్రాలతో మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ యువ దర్శకుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎవరితో చేయబోతున్నారు, ఎలాంటి కథతో రాబోతున్నారనే అంశంపై పరిశ్రమ వర్గాల్లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి:

అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్.. దర్శకుడెవరంటే?

‘కల్కి 2’ షూటింగ్‌పై అప్‌డేట్.. సాయిపల్లవి ఎంట్రీపై టాక్

దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?

Updated Date - Oct 18 , 2026 | 06:11 PM

Garividi Lakshmi: నాలుగు జిల్లాలకే పరిమితమైన నా కథ.. ప్రపంచమంతా తెలిసింది..

Sobhita Dhulipala: మాతృత్వం నా కల.. కానీ తొందరపడను!

Spirit: 'స్పిరిట్' రిలీజ్ డేట్ ఫిక్స్ ..ఇక రచ్చ రచ్చే

The Paradise: ఓటీటీలోకి నాని ‘ది పారడైజ్.. ఎప్పుడు.. ఎక్కడ..  

‘గరివిడి లక్ష్మి’పై రవితేజ, తేజ సజ్జా ప్రశంసల వర్షం!