సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణీ.. పోరులో గెలిచేదెవరు?

ABN, Publish Date - Nov 28 , 2026 | 08:49 PM

డిసెంబర్ 4న టాలీవుడ్‌లో ఆసక్తికర ఫైట్ జరగనుంది. నితిన్‌ ‘అలియాస్ రుక్మిణీ’, నాగ చైతన్య ‘వృషకర్మ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల కంటెంట్ పై ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్‌లో పాజిటీవ్ బజ్ నెలకొని ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది.

Vrushakarma vs Alias Rukmini

డిసెంబర్ 4న టాలీవుడ్‌లో ఆసక్తికర ఫైట్ జరగనుంది. నితిన్‌ (Nithiin) ‘అలియాస్ రుక్మిణీ’ (Alias Rukmini), నాగ చైతన్య (Naga Chaitanya) ‘వృషకర్మ’ (Vrushakarma) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల కంటెంట్ పై ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్‌లో పాజిటీవ్ బజ్ నెలకొని ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. హీరో నితిన్ సాలీడ్‌ హిట్‌ కోసం కొన్నేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. ఆరేళ్ళ క్రితం వచ్చిన ‘భీష్మ’ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని నితిన్ అందుకోలేదు. నితిన్‌కు పరాజయాలు కొత్తేమీ కాదు.. ఇప్పటి వరకూ 35 చిత్రాల్లో నటించినా.. అందులో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు ఆరేడు మాత్రమే. అయినా నితిన్‌తో సినిమాలు తీసే దర్శకులు, నిర్మాతలకు కొదవ లేదు. గత యేడాది వచ్చిన ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ చిత్రాలు నితిన్‌కు తీవ్ర నిరాశ కలిగించాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న సినిమా ‘అలియాస్ రుక్మిణీ’ పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీని నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా నిర్మిస్తోంది. ‘అలియాస్ రుక్మిణీ’ సినిమాను తెరకెక్కిస్తోంది ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్‌. తొలి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్‌.. ఈసారి కమర్షియల్‌ సక్సెస్ కొడతాడని నాని టీమ్‌ భావిస్తోంది. ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో అది సాధ్యమనే నమ్మకంలో యూనిట్ ఉంది.


ఇదిలా ఉంటే.. ‘తండేల్‌’ (Thandel) మూవీతో తొలిసారి వంద కోట్ల క్లబ్‌లో చేరిన నాగ చైతన్య ఆ విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. అందుకే ఆచితూచి ‘వృషకర్మ’ స్క్రిప్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్తిక్ వర్మ దండు తొలి చిత్రం ‘భమ్ భోలేనాథ్‌’ పరాజయం పాలైనా.. రెండో సినిమా ‘విరూపాక్ష’ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఆ సక్సెస్‌ను ‘వృషకర్మ’తో కంటిన్యూ చేయాలని దర్శకుడు కార్తిక్ గట్టిగా కోరుకుంటున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.


డిసెంబర్‌ ఫస్ట్ వీకెండ్‌లో ‘వృషకర్మ, అలియాస్ రుక్మిణీ’తో పాటు దుల్కర్ సల్మాన్‌ ‘శ్రీశ్రీ’, విశ్వక్ సేన్ ‘లెగసీ’ విడుదల కావాల్సి ఉంది. ముందే ఈ సినిమాల రిలీజ్‌ డేట్స్‌ను ప్రకటించినా.. ఇప్పుడవి రీ-షెడ్యూల్‌ అయ్యాయి. ‘శ్రీశ్రీ’ షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ‘లెగసీ’ని కాస్త గ్యాప్ తర్వాత విడుదల చేయాలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ భావిస్తున్నారు. రాబోయే సంవత్సరం ఫిబ్రవరిలో అని అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇంకా, విజయ్ సేతుపతి తమిళ చిత్రం ‘ట్రైన్’ కూడా తెలుగులో వస్తుందని మొదట ప్రకటించారు కానీ ఇప్పుడది తమిళంలో మాత్రమే వస్తోంది. అలానే లారెన్స్ ‘మహావీర్‌ కర్ణ’ మూవీ వచ్చే యేడాదికి వాయిదా పడింది. ‘సీతన్నపేట గేట్’ అనే సినిమా ఒకటి ఉన్నా.. డిసెంబర్ 4న ప్రధానమైన పోటీ ‘‘వృషకర్మ’, అలియాస్ రుక్మిణీ’ మధ్యలోనే ఉండనుంది. గ్రాండ్‌ కమ్ బ్యాక్‌ కోసం నితిన్ ప్రయత్నిస్తుంటే... 'తండేల్' విక్టరీని కొనసాగించాలని నాగచైతన్య ఆశిస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

దేశభక్తి నేపథ్యంలో ‘మిసెస్ కల్నల్’.. టీజర్ విడుదల

బాలయ్య-వివేక్ ఆత్రేయ ‘కురుక్షేత్రం’కు బ్రేక్?.. కారణం ఇదేనా

ఏడు భాషల్లో విడుదలకు సిద్ధమైన ‘సీతన్నపేట గేట్’..

Updated Date - Nov 28 , 2026 | 08:49 PM