ఏడు భాషల్లో విడుదలకు సిద్ధమైన ‘సీతన్నపేట గేట్’..

ABN , Publish Date - Nov 28 , 2026 | 07:04 PM

వైఎంఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై వైఎంఆర్ నిర్మాణంలో, దర్శకుడు వై. రాజ్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సీతన్నపేట గేట్’. ఈ సినిమా ఏడు భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

Seethannapeta Gate Pre Release Event

వైఎంఆర్ క్రియేషన్స్ (YMR Creations) బ్యానర్‌పై వైఎంఆర్ నిర్మాణంలో, దర్శకుడు వై. రాజ్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సీతన్నపేట గేట్’ (Seethannapeta Gate). వేణు గోపాల్ హీరోగా పరిచయమవుతోన్న ఈ చిత్రంలో నిపుణ్, కిస్లే చౌదరి, సురభి తివారి, రఘురాం రెడ్డి, పార్థు, 8 పీఎం సాయి కుమార్, సుధీక్షజ ప్రధాన పాత్రలు పోషించారు. ఏడు భాషల్లో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా చిత్ర బృందం ప్రీ-రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, హీరో విజయ రామరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. ‘సీతన్నపేట గేట్’ చిత్రాన్ని నిర్మాత వైఎంఆర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసిన దర్శకుడు రాజ్ కుమార్ ఈ చిత్రంలోని ప్రతి పాత్రను ఎంతో వైల్డ్‌గా తీర్చిదిద్దారు. మ్యూజిక్ ట్రెండీగా, యోగి ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. హీరో వేణు చాలా నేచురల్‌గా నటించాడు. డిసెంబర్ 4న విడుదలవుతున్న ఈ సినిమాను ప్రేక్షకులంతా చూసి ఆదరించాలని కోరారు. హీరో విజయ రామరాజు మాట్లాడుతూ.. తన మంచి మిత్రుడు వేణుకు, తొలినాళ్లలో తనకు అండగా నిలిచిన దర్శకుడు రాజ్ కుమార్‌కు, నిర్మాత వైఎంఆర్‌కు ఈ చిత్రంతో మంచి విజయం, లాభాలు రావాలని ఆకాంక్షించారు.


హీరో వేణు గోపాల్ మాట్లాడుతూ.. ‘సీతన్నపేట గేట్’ చిత్రంతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, నిర్మాతల మార్పులు ఎదురైనా చివరకు సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. దర్శకుడు రాజ్ కుమార్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. మాస్ సినిమాలను ఇష్టపడే వారందరికీ ‘సీతన్నపేట గేట్’ కచ్చితంగా నచ్చుతుంది. కొత్తవాళ్లందరం కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని మీడియా, ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరారు. దర్శకుడు వై. రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఐదు పాటలు, అనవసరపు ఎలివేషన్స్ అంటూ రొటీన్ కమర్షియల్ సినిమాలా ఇది ఉండదు. నేను విన్న కొన్ని యథార్థ సంఘటనలకు నా కల్పనను జోడించి ఈ కథను రాసుకున్నాను. ఇందులోని ట్విస్టులు, కొత్త తరహా మేకింగ్, లైటింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ అందరూ చర్చించుకునేలా ఉంటాయి. మా సినిమా చూసి నచ్చితేనే మాట్లాడండని తెలిపారు. నిర్మాత వైఎంఆర్ మాట్లాడుతూ.. జెమినీ ల్యాబ్స్ అధినేత మనోహర్ ప్రోత్సాహం వల్లే తన మొదటి ప్రాజెక్ట్‌ను తెలుగులోకి తీసుకొచ్చానని, తెలుగులో విడుదల చేస్తున్న బుజ్జికి, నారాయణకు కృతజ్ఞతలని పేర్కొన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

రామ్ చరణ్-సుకుమార్ ‘RC17’ రిలీజ్ ప్లాన్ ఇదేనా?

మోక్షజ్ఞ చిత్రంలో ఎన్టీఆర్.. థియేటర్లలో విధ్వంసమే

విశ్వక్ ‘లెగసీ’ షూటింగ్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే

Updated Date - Nov 28 , 2026 | 07:04 PM

Nani: పరాజయాలతో నాని రూట్ మారిందా..?

Irumudi: 100 రోజులు పూర్తి.. థియేటర్లలో పాటలతో మరోసారి మ్యాజిక్!

క్రెడిట్ కొట్టేస్తున్నారు.. అల్లు అరవింద్‌కు రాజమౌళి సలహా

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 175వ చిత్రం షురూ

ఎన్టీఆర్‌తో మూవీ.. రావిపూడి ప్లాన్ మామూలుగా లేదుగా