Vrushakarma : సృష్టి ధర్మం కోసం మహాయుద్ధం!

ABN, Publish Date - Nov 26 , 2026 | 10:11 AM

నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న వృషకర్మ ట్రైలర్ విడుదలైంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథాలజీ మిస్టరీ థ్రిల్లర్ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma). ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఓ విభిన్నమైన కథాంశంతో, మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ దర్శకుడు ఈ కథను రూపొందించినట్లు  ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ‘సృష్టి ధర్మాన్ని కాపాడటం కోసం సాక్షాత్తు ఆ దైవమే ఎంచుకున్న వృషకర్మవు నువ్వే’ అంటూ ట్రైలర్‌లో వినిపించే సంభాషణలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ ట్రైలర్ మీరు చూసేయండి.. 

Updated at - Nov 26 , 2026 | 10:27 AM