దేశభక్తి నేపథ్యంలో ‘మిసెస్ కల్నల్’.. టీజర్ విడుదల

ABN , Publish Date - Nov 28 , 2026 | 08:14 PM

ఆది క్రియేషన్స్ బ్యానర్‌పై విలోక్, కౌశిక్ సమర్పణలో సాయి కృష్ణ నిర్మాతగా, శ్రీకరం ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిసెస్ కల్నల్’. తాజాగా ఈ మూవీ టీజర్‌ని మేకర్స్ వదిలారు.

Mrs Colonel Teaser Launch

ఆది క్రియేషన్స్ బ్యానర్‌పై విలోక్, కౌశిక్ సమర్పణలో సాయి కృష్ణ నిర్మాతగా, శ్రీకరం ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిసెస్ కల్నల్’ (Mrs. Colonel). ప్రియా హెగ్డే, చిరాగ్ జానీ జంటగా నటించిన ఈ సినిమాలో మాన్య గౌడ, మహేష్ విట్టా, టెంపర్ వంశీ, సాహితీ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా శనివారం చిత్ర బృందం ఈ మూవీ టీజర్‌ను ఘనంగా విడుదల చేసింది.

ఈ కార్యక్రమంలో డెబ్యూ డైరెక్టర్ శ్రీకరం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘మిసెస్ కల్నల్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు ఎంతో యుద్ధం చేశాం. ఇది కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమా మాత్రమే కాదు, ఇందులో అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉంటాయి. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు. నిర్మాత సాయి కృష్ణ మాట్లాడుతూ.. ప్రభాకర్‌తో కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ఇష్టంతో నిర్మించామని, సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


హీరోయిన్ ప్రియా హెగ్డే మాట్లాడుతూ.. ‘మిసెస్ కల్నల్’ మాకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఎన్నో సవాళ్లు, మధురానుభూతులతో కూడిన మూడేళ్ల ప్రయాణం. నాకు ఇంత మంచి పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్ని సమస్యలు ఎదురైనా నిర్మాత ఎంతో ధైర్యంగా నిలబడ్డారు. దర్శకుడు ప్రభాకర్ సర్ చాలా కూల్‌గా ఉంటూ అద్భుతంగా తెరకెక్కించారు. వెయ్యి శాతం కష్టపడి చేసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు.


హీరో చిరాగ్ జానీ మాట్లాడుతూ.. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరోగా నటించడం తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమని, అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలని పేర్కొన్నారు. నటుడు మహేష్ విట్టా మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పారు. మాన్య గౌడ మాట్లాడుతూ.. తెలుగులో తనకు ఇదే మొదటి చిత్రమని, దర్శకనిర్మాతలతో పాటు ఆదిలక్ష్మీ గారి సపోర్ట్ మరువలేనిదని అన్నారు. ఎడిటర్ కార్తికేయన్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందని, టీజర్ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బాలయ్య-వివేక్ ఆత్రేయ ‘కురుక్షేత్రం’కు బ్రేక్?.. కారణం ఇదేనా

ఏడు భాషల్లో విడుదలకు సిద్ధమైన ‘సీతన్నపేట గేట్’..

రామ్ చరణ్-సుకుమార్ ‘RC17’ రిలీజ్ ప్లాన్ ఇదేనా?

Updated Date - Nov 28 , 2026 | 08:14 PM

స్టార్ హీరోస్ మూవీస్ ఐఎమ్‌డిబీ రేటింగ్స్.. ఆ సినిమానే టాప్

Train Trailer: విజయ్ సేతుపతి ‘ట్రైన్’ ట్రైలర్ వచ్చేసింది!

Nani: పరాజయాలతో నాని రూట్ మారిందా..?

Idupu kayitham: ‘ఇడుపు కాయితం’ నుంచి మరో పాట వచ్చేసింది!

క్రెడిట్ కొట్టేస్తున్నారు.. అల్లు అరవింద్‌కు రాజమౌళి సలహా