Naga Chaitanya - Sobhita: ‘శ్రీమతిగా ఏడాది’ అంటూ శోభిత స్పెషల్ వీడియో
ABN , Publish Date - Dec 04 , 2025 | 02:29 PM
నాగ చైతన్య( (Naga Chaitanya), శోభిత ధూళిపాళ మూడు మూళ్ళ బంధంతో ఒకటై ఏడాది పూర్తయింది. గతేడాది డిసెంబర్ 4న వీరిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
నాగ చైతన్య( (Naga Chaitanya), శోభిత ధూళిపాళ మూడు మూళ్ళ బంధంతో ఒకటై ఏడాది పూర్తయింది. గతేడాది డిసెంబర్ 4న వీరిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి వార్షికోత్సవం సందర్భంగా శోభిత స్పెషల్ వీడియోను షేర్ చేశారు.

'నేను ఎంతో ప్రేమించిన నాగచైతన్యతో ఏడడుగులు వేసి ఏడాది అయింది. 'చైతు నా జీవితంలోకి వచ్చాకే జీవితం పరిపూర్ణ మైంది' అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ‘శ్రీమతిగా ఏడాది’ అంటూ పెళ్లి నాటిసంగతులు గుర్తుచేసుకుంటూ వీడియోను షేర్ చేశారు.

'నీ ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టం మై లవ్. హ్యాపీ యానివర్సరీ' అని శోభిత పోస్ట్ కు నాగ చైతన్య రిప్లై ఇచ్చారు.