Naga Chaitanya : ఆ చిన్నారులకు ఇలాంటి క్షణాలు ఎంతో ముఖ్యం!

ABN , First Publish Date - 2023-11-17T10:10:05+05:30 IST

అక్కినేని నాగచైతన్య తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని సెయింట్‌ జూడ్స్‌ చైల్డ్‌కేర్‌ సెంటర్‌లో సందడి చేశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో కొంత సమయం గడిపారు. ఆ చిన్నారుల ముఖాల్లో నవ్వులు పూయించారు.

Naga Chaitanya : ఆ చిన్నారులకు ఇలాంటి క్షణాలు ఎంతో ముఖ్యం!

అక్కినేని నాగచైతన్య తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని సెయింట్‌ జూడ్స్‌ చైల్డ్‌కేర్‌ సెంటర్‌లో సందడి చేశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో కొంత సమయం గడిపారు. ఆ చిన్నారుల ముఖాల్లో నవ్వులు పూయించారు. ఈ నెల 14న బాలల దినోత్సవం సందర్భంగా ఆయన  చిన్నారులను కలిశారు. వారికి బహుమతులు ఇచ్చి సరదాగా ముచ్చటించారు. అంతే కాదు ఆ చిన్నారు ఆడిపాడారు. తన డాన్స్ ల తో వారిని ఆనందపరిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు కాస్త ఆలస్యంగా నెట్టింట దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ఆ దృశ్యాల్లో ఓ చిన్నారి ఏదో చెబుతుండగా చై ఎంతో శ్రద్ధగా వింటున్నారు. అయితే చైతూ చైల్డ్‌ కేర్‌ సెంటర్‌కి రావడంతో చిన్నారులంతా ఎంతో ఆనందంగా ఉన్నారని నిర్వాహకులు చెబుతున్నారు.ఈ చిన్నారులకి ఇలాంటి క్షణాలు ఎంతో  ముఖ్యం అని చెబుతున్నారు.  చైతూ ఫ్యాన్స్ ఈ   ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

NC.gif

ఈ ఏడాది 'కస్టడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వచ్చిన ఆయన ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో 'NC 23' చిత్రం చేస్తున్నారు. వలస మత్స్యకారుల జీవితాలను అద్దం పట్టే యథార్థ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే సెట్స్‌ మీదకెళ్లనుంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం తన స్టైలింగ్‌ మార్చుకున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. తాజాగా నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్‌ సిరీస్‌ విడుదలకు సిద్థంగా ఉంది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబర్‌ ఒకటో తేదీన నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

Updated Date - 2023-11-17T10:25:47+05:30 IST