సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మనం ఎప్పుడూ భయపడకూడదు.. ఇచ్చిపడేయాలి: విశ్వక్‌సేన్

ABN, Publish Date - Oct 18 , 2026 | 10:14 PM

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ‘కల్ట్’ చిత్రంతో డార్క్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నారు. ఆయన హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు.

Cult Trailer Launch Event

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ (Vishwak Sen) ‘#CULT’ చిత్రంతో డార్క్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నారు. ఆయన హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. వాస్తవ జీవితంలో చోటుచేసుకున్న భయానక ఘటనల స్ఫూర్తితో రూపొందించిన భారతదేశపు తొలి స్లాషర్ థ్రిల్లర్‌ చిత్రమిది. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర విశేషాలను హీరో విశ్వక్ తెలిపారు.


ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. ‘‘మనం ఎప్పుడూ భయం, స్ట్రెస్, యాంగ్జైటీ తీసుకోకూడదు. ఇవ్వాలి.. ఇచ్చి పడేయాలి. ఈ సినిమా లాంచ్ చేసినప్పుడు మా యాక్టింగ్ గురువు తాజుద్దీన్‌ను పిలిచి డైరెక్ట్ చేయమని అడిగాను. కాకపోతే ఈ మధ్యకాలంలో నా నుంచి వచ్చిన కొన్ని సినిమాలు అనుకున్నంతగా రాణించలేదు. ఒకర్ని ఒడ్డుకి లాగాలంటే నేను ఒడ్డున ఉండాలి. అందుకే ఈ సినిమాని నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పాను. ఈ సందర్భంగా ఆయనకు సారీ చెప్తున్నాను. నేను నా డైరెక్టర్‌ని నమ్ముతాను. ఫలితం ఎలా ఉన్నప్పటికీ అందరం కలిసే సినిమా చేస్తాం. ఒక సినిమా వర్కవుట్ కాకపోవడానికి కేవలం డైరెక్టర్ కారణం కాదు. చాలా కారణాలు ఉంటాయి.


‘ఫలక్‌నుమా దాస్’ సినిమాకి నా కోసం నేను నిలబడ్డాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘కల్ట్’ సినిమాని కూడా నేనే డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా గ్రాండ్ ఫిల్మ్. ఇందులో ఎలాంటి ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఉండవు. చాలా హానెస్ట్‌గా ఈ సినిమా చేశాం. అంతా కష్టపడి పనిచేశాం. ఈ సినిమాకు 150 మంది ప్రొఫెషనల్ యాక్టర్స్ పనిచేశారు. వారంతా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలి, ఎదగాలని పెద్ద పెద్ద డ్రీమ్స్‌తో వచ్చిన యాక్టర్స్. నా కోసం ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమా మొదటి ఐదు నిమిషాలకే అందరినీ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ట్రైలర్ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది గ్లోబల్ కంటెంట్. అందుకే సినిమాని జపనీస్, స్పానిష్ భాషల్లో కూడా డబ్ చేశాం. ఇది భాషను దాటి వెళ్లే సినిమా. రెండు గంటల 20 నిమిషాల పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. యాక్షన్ కంటే ఆడియన్స్ డ్రామాకి కనెక్ట్ అవుతారు. నేను ఎక్స్‌పెరిమెంట్ చేసిన ప్రతిసారీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఆ నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

యంగ్ హీరోతో ‘ఓ పిట్టకథ’ దర్శకుడి చిత్రం ప్రారంభం

ముంబైలో సంచలనం.. హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ఆ గ్యాంగ్ పనేనా?

‘కల్ట్’ ట్రైలర్ రివ్యూ: నెత్తురోడే యాక్షన్.. ఒళ్లు గగుర్పొడిచే వయొలెన్స్

Updated Date - Oct 18 , 2026 | 10:14 PM