Cult: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్.. కల్ట్ 'హీ ఈజ్ మై దోస్తీ' సాంగ్ అదిరింది
ABN , Publish Date - Jul 20 , 2026 | 08:51 AM
విశ్వక్‌సేన్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కల్ట్ చిత్రం నుంచి దోస్తీ సాంగ్ రిలీజ్ అయింది.
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ (Vishwak Sen) మరోసారి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తన కెరీర్‌లో ఎప్పటికప్పుడు విభిన్న కథలతో ముందుకొచ్చే ఆయన ఇప్పుడు కల్ట్ #CULT తో పూర్తిగా కొత్త జానర్‌లో రాబోతున్నారు. విశ్వక్‌సేన్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రాన్ని సందీప్ కాకరాల తారక్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భారతదేశపు తొలి ఆథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, నిజ జీవితంలోని భయానక సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది, ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించబోతోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ ఆసక్తిని నెలకొల్పింది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఫ్రెండ్ షిప్ సాంగ్ హీ ఈజ్ మై దోస్తీ (He Is My Dosthi Lyrical Song) రిలీజ్ చేశారు. సంతోష్ వెంకీ (Santhosh Venky) సాహిత్యం అందించిన ఈ పాటకు రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతం అందించగా కార్తీక్ (Karthik) ఆలపించాడు. పాట వింటుంటే త్వరగానే చార్ట్ బస్టర్స్‌లో చోటు సంపాదించుకోవడం ఖాయంగా తెలుస్తోంది.