Cult Movie: విశ్వక్ సేన్.. ‘పాన్ గ్లోబల్’ సినిమా
ABN , Publish Date - May 11 , 2025 | 02:02 PM
ఒకప్పుడు ఉత్తరాది, దక్షిణాది చిత్రాలంటూ సినిమాలు వస్తుండేవి. ఇప్పుడు ఆ హద్దులు చెరిగిపోయాయి. ఒక స్టెప్ ముందుకేసి పాన్ ఇండియాకు చేరింది. ఇప్పుడే అదీ పాత పడింది.
ఒకప్పుడు ఉత్తరాది, దక్షిణాది చిత్రాలంటూ సినిమాలు వస్తుండేవి. ఇప్పుడు ఆ హద్దులు చెరిగిపోయాయి. ఒక స్టెప్ ముందుకేసి పాన్ ఇండియాకు చేరింది. ఇప్పుడే అదీ పాత పడింది. ఇప్పుడంతా పాన్ వరల్డ్, గ్లోబల్ సినిమా (Global Cinema) అనే ట్రెండ్ నడుస్తోంది. మీడియం రేంజ్ సినిమాలు కూడా ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ వైపు కన్నెశాయి. తాజాగా విశ్వక్‌సేన్ (Vishwak Sen) సినిమా కూడా ‘పాన్ గ్లోబల్’ ట్యాగ్ లైన్‌తో విడుదల అవుతోంది. విశ్వక్ సేన్ దర్శకత్వంలో ‘కల్ట్’ (Cult Movie) అనే సినిమా ఆదివారం కొబ్బరికాయ కొట్టారు. రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ అయిపోయింది. 40 మంది కొత్తవారిని ఈ చిత్రంతో పరిచయం చేయబోతున్నాడు విశ్వక్. తాను కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ సంభాషణలు అందిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇదో యాక్షన్ థ్రిల్లర్. కానీ ఇప్పటి వరకూ మనం చూసిన సినిమాల తరహా కాదు. ఈ తరహా కథ, కథనాలు వెండితెరపై చూడడం ఇదే తొలిసారి అంటున్నాడు విశ్వక్.
గ్లోబల్ స్థాయి కథ ఉందనే జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తామని చెబుతున్నారు. నిజానికి ‘కల్ట్’ సినిమా కోసం దర్శకత్వానికే పరిమితం అవ్వాలని అనుకొన్నాడు విశ్వక్. కానీ చివరి నిమిషంలో ఇందులో ఓ కీ రోల్ కోసం మేకప్ వేసుకోవలసి వచ్చింది. ఇటీవల ‘లైలా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్. ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అడల్ట్ కంటెంట్ ఎక్కువ అయ్యిందంటూ, బూతులు హద్దు మీరాయంటూ విమర్శల్ని ఎదురయ్యాయి. దాంతో విశ్వక్ సారీ కూడా చెప్పాడు. ఇక మీదట అందరికీ నచ్చే సినిమా?ని తీసానని మాటిచ్చాడు. మరీ గ్లోబల్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.