యంగ్ హీరోతో ‘ఓ పిట్టకథ’ దర్శకుడి చిత్రం ప్రారంభం

ABN , Publish Date - Oct 18 , 2026 | 09:17 PM

యంగ్ యాక్టర్ చంద్రహాస్ కోట్ల హీరోగా విభిన్న కథాంశంతో రూపుదిద్దుకోనున్న సరికొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత దినేష్ కుర్ర ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మిస్తున్నారు.

Chendu Muddu New Movie Launch

యంగ్ యాక్టర్ చంద్రహాస్ కోట్ల (Chandrahas Kotla) హీరోగా విభిన్న కథాంశంతో రూపుదిద్దుకోనున్న సరికొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ (Kurra Productions) పతాకంపై నిర్మాత దినేష్ కుర్ర ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మిస్తున్నారు. ‘ఓ పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి వైవిధ్యభరితమైన కాన్సెప్ట్ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చెందు ముద్దు (Chendu Muddu) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్‌లో పలు ఆసక్తికర ప్రాజెక్ట్‌లు రూపుదిద్దుకుంటుండగా, తాజాగా చంద్రహాస్-చెందు ముద్దు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.


హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ క్లాప్ కొట్టగా.. గంగరాజు కాకర్ల, రంగారావు వేములపల్లి, సిరాజ్ ఎస్ఎం, మధుసూదన్ సంయుక్తంగా చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. అలాగే దీపా ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గౌడ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.


ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి టాలెంటెడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. శివా రెడ్డి ఎస్వి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, డి. వెంకట ప్రభు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి:

ముంబైలో సంచలనం.. హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ఆ గ్యాంగ్ పనేనా?

‘కల్ట్’ ట్రైలర్ రివ్యూ: నెత్తురోడే యాక్షన్.. ఒళ్లు గగుర్పొడిచే వయొలెన్స్

తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్.. ఆ లిస్ట్‌లోకి చేరిన దర్శకుడు

Updated Date - Oct 18 , 2026 | 09:18 PM

కావ్య మారన్‌తో పెళ్లి.. తెలుగువాళ్లకి అనిరుధ్ మరింత దగ్గర కాబోతున్నాడా?

ఆర్ నారాయణమూర్తి గురించి అంతా తెలుసుకోవాలి: శ్రీవిష్ణు

‘పెద్ది’లో నాకు బాగా నచ్చిన సీన్ అదే: రామ్ చరణ్

ఆ విషయంలో హీరోయిన్లకు మినహాయింపు లేదు: ‘బ్లాస్ట్’ బ్యూటీ

జనవరి 12న విడుదల.. అనిల్ రావిపూడి, నీ చర్యలు ఊహాతీతం