సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విరాట్ కర్ణ నెక్ట్స్ ఫిల్మ్‌కు చిరు ఫిల్మ్ టైటిల్.. గ్లింప్స్ అదిరింది

ABN, Publish Date - Nov 27 , 2026 | 06:45 PM

‘హను-మాన్’ వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న కొత్త చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు.

Rustum Movie Still

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడింది. ‘హను-మాన్’ (Hanu-Man) వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (PrimeShow Entertainment) బ్యానర్‌పై యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రానికి ‘రుస్తుం’ (Rustum) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. డెబ్యూ డైరెక్టర్ కనిష్క గంధం రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. నేడు (నవంబర్ 27) విరాట్ పుట్టినరోజు (Happy Birthday Virat Karrna) సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానులకు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ టైటిల్‌తో..

‘రుస్తుం’ అనే టైటిల్ వినగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. 1984లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, ఊర్వశి జంటగా నటించిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా టైటిల్ కూడా ‘రుస్తుం’ కావడం విశేషం. ఇప్పుడు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత, అదే క్రేజీ టైటిల్‌ను సరికొత్త విజన్, హై-వోల్టేజ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో విరాట్ కర్ణ కోసం తీసుకొస్తున్నారు మేకర్స్.


గ్లింప్స్ ఎలా ఉందంటే..

విడుదలైన 1 నిమిషం 36 సెకన్ల టైటిల్ గ్లింప్స్ సినిమా ప్రపంచాన్ని ఎంతో ఇంటెన్స్‌గా, స్టైలిష్‌గా పరిచయం చేసింది. అద్భుతమైన యానిమేషన్, విజువల్స్‌తో ‘రెనితార్ సిటీ (Renithar City)’, ‘ట్రినిటీ పోర్ట్’, ‘ధోబీ ఘాట్’, ‘మార్కెట్ యార్డ్’, ‘దర్వాజా బస్తీ’, ‘కాసాబ్లాంకా’, ‘అగ్నిగిరి’ వంటి కీలక లొకేషన్లను చూపిస్తూ ఒక ప్రత్యేకమైన క్రైమ్ అండ్ యాక్షన్ ప్రపంచాన్ని ఆవిష్కరించారు. చివర్లో వెయ్యి మంది శత్రువులు చుట్టుముట్టినా ఏమాత్రం వెనక్కి తగ్గని యోధుడిగా విరాట్ పాత్రను రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంది. హీరో ముఖం పూర్తిగా చూపించలేదు కానీ.. ఇందులో విరాట్ చక్కటి ఫిజిక్, బ్యాక్ పోజ్, ఇంపోజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కనిపించి క్యూరియాసిటీని పెంచారు.


రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా ‘రుస్తుం’ చిత్రాన్ని ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. పవర్‌ఫుల్ స్టోరీటెల్లింగ్, గ్రిప్పింగ్ డ్రామాతో పాటు లోతైన మానవీయ భావోద్వేగాల మేళవింపుతో ఈ కథ సాగనుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి తనతో తానే చేసే అంతర్గత పోరాటాన్ని ఇందులో చూపించబోతున్నారని, అతనిలోని అపరాధ భావన అతనికి ఎదురయ్యే అతిపెద్ద శత్రువుగా నిలుస్తుందని చిత్ర బృందం వెల్లడించింది. టైటిల్ గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు పెంచిన ‘రుస్తుం’ చిత్రానికి సంబంధించిన మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బాలయ్య - కొరటాల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

మీకు యాక్టింగ్ వస్తే.. ‘ఆర్సీ17’లో నటించే ఛాన్స్.. ఇలా ట్రై చేయండి?

విజయానికి ముందు... ఆ తర్వాత... సాత్విక వీరవల్లి చెప్పిన విశేషాలు

Updated Date - Nov 27 , 2026 | 06:45 PM