Virat Karrna: క్లయిమాక్స్ చిత్రీకరణలో 'నాగబంధం'

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:29 PM

విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న 'నాగబంధం' సినిమా క్లయిమాక్స్ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో జరుగుతోంది. దీని కోసం రూ. 20 కోట్ల బడ్జెట్ లో సెట్ ను నిర్మించారు.

Nagabandham Movie

యంగ్ హీరో విరాట్ కర్ణ (Virat Karrna), అభిషేక్ నామా (Abhishek Nama) దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'నాగబంధం' (Nagabandham). ఇది డివైన్, యాక్షన్, విజువల్ ఫీస్ట్ తో ఒక మ్యాసీవ్ సినిమాటిక్ వండర్ గా రూపొందుతోంది. ప్రస్తుతం నానక్‌రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో గూస్‌బంప్స్‌ పుట్టించే క్లైమాక్స్‌ సీక్వెన్స్ ను చిత్రబృందం చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఫీల్ ను అందించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేసి ఓ గ్రాండ్ సెట్ ను వేశారు.


'పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తుంద'ని చిత్ర దర్శకుడు అభిషేక్ నామా తెలిపారు. 'ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశామని, ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ తన బృందంతో కలిసి సెట్లోని ప్రతి అంశాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించి, కథనం స్థాయిని మరింతగా పెంచేలా కేర్ తీసుకున్నార'ని ఆయన చెప్పారు.


అద్భుతమైన యాక్షన్‌కు ప్రసిద్ధిగాంచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీని 'నాగబంధం' టీం ప్రత్యేకంగా ఎంపిక చేసింది. ఆయన బెర్త్ టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దితున్నారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ సీక్వెన్ అద్భుతంగా, విజువల్‌గా మైండ్ బ్లోయింగ్ గా వుండబోతోందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా కథ భారతదేశం లోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగుతుందని, శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న నాగబంధం అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ నడిచే ఈ కథ, పద్మనాభ స్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల గుప్త నిధుల మిస్టరీల స్ఫూర్తితో వుంటుందని అభిషేక్ నామా చెప్పారు. ఈ సినిమాలో నభా నటేష్ (Nabha Natesh), ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) కథానాయికలుగా కాగా జగపతి బాబు (Jagapathi Babu), జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Also Read: Shyaamali: ఆ పెళ్లి గురించి కొంచెం కూడా ఆలోచించలేదు...

Also Read: Rashmika Mandanna: ఎప్పుడు..  ఎక్కడ.. ఎలా మాట్లాడాలో అప్పుడే మాట్లాడతా... 

Updated Date - Dec 04 , 2025 | 01:29 PM