Virat Karna: నిర్మాణం తుదిదశలో 'నాగబంధం'

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:35 PM

విరాట్ కర్ణ హీరోగా నటించిన 'నాగబంధం' సినిమా టీజర్ శివరాత్రి కానుకగా ఈ నెల 15న విడుదల కానుంది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామా వేసవిలో జనం ముందుకు రానుంది.

Nagabandham Teaser

విరాట్ కర్ణ (Virat Karna) హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'నాగబంధం' (Nagabandham). ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాను అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్నారు. దీనిని కిశోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. అభే, జునైద్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్‌ (Nabha Natesh), ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఫిబ్రవరి 15, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.


ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఒక పురాతన ఆలయంలోని రహస్య నిధి చుట్టూ రక్షణగా చుట్టుకుని ఉన్న ఒక మహా నాగుపాము కనిపిస్తోంది. ఇది సినిమాలోని ఆధ్యాత్మిక దైవిక రహస్యాన్ని సూచిస్తుంది. భారతదేశంలోని చారిత్రాత్మక విష్ణు దేవాలయాల నేపథ్యంలో సాగే ఈ కథాంశం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుందని దర్శకుడు అభిషేక్ నామా తెలిపారు. ఇందులో ఇతర కీలక పాత్రలను జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ తదితరులు పోషిస్తున్నారు.

సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ, ఆర్‌సి ప్రణవ్ ఎడిటింగ్, అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమౌతోందని నిర్మాతలు చెప్పారు. ఈ వేసవిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 'నాగబంధం' విడుదల కానుంది.

Updated Date - Feb 02 , 2026 | 06:35 PM