‘టైసన్ నాయుడు’ ఫోక్ బ్యాంగర్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ అదిరింది

ABN , Publish Date - Nov 07 , 2026 | 08:56 AM

టాలీవుడ్ ప్రామిసింగ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, విలక్షణ దర్శకుడు సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’. ఈ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్ విడుదలైంది.

టాలీవుడ్ ప్రామిసింగ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హీరోగా, విలక్షణ దర్శకుడు సాగర్ కె. చంద్ర (Saagar K Chandra) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu). ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ మునుపెన్నడూ కనిపించని సరికొత్త మాస్ మేకోవర్‌తో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించనుండగా, గ్లామరస్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కగా.. తాజాగా చిత్ర మ్యూజికల్ జర్నీని ఎనర్జిటిక్‌గా ప్రారంభిస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ (Madarasi Rabbaru Bomma) లిరికల్ వీడియోను విడుదల చేశారు.


మాస్ ఫోక్ బీట్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు అదిరిపోయే పల్లెటూరి సెలబ్రేషన్ వైబ్‌ను తీసుకొచ్చారు. తనదైన మార్క్ ఎలక్ట్రిఫైయింగ్ రిథమ్స్, ఇన్ఫెక్షియస్ బీట్స్, హై ఎనర్జీ కంపోజిషన్‌తో శ్రోతలను ఉర్రూతలూగించేలా ఈ పాటను స్వరపరిచారు. ప్రముఖ గేయ రచయిత సురేష్ గంగుల అందించిన సాహిత్యం మాస్ ఆడియన్స్‌కు ఇట్టే కనెక్ట్ అయ్యేలా సాగింది. కథానాయకుడు తన ప్రియురాలిని ‘మదరాసి రబ్బరు బొమ్మ’ అంటూ ఆటపట్టించడం, అందుకు ఆమె అంతే చమత్కారంగా బదులివ్వడం మధ్య సాగే సరదా రొమాంటిక్ సంభాషణలు పాటకు హైలైట్‌గా నిలిచాయి. ప్రముఖ జానపద గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్న, సింగర్ రోహిణి సొరట్ తమ వాయిస్‌తో పాటకు అసలైన ఫోక్ ప్రాణం పోసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


విజువల్ పరంగా చూస్తే ఈ పాటను కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో, పండుగ వాతావరణాన్ని తలపించేలా గ్రాండ్ సెట్లలో అత్యంత రిచ్‌గా చిత్రీకరించారు. సంప్రదాయ ఫోక్ దుస్తుల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, నేహా శెట్టి గ్లామరస్ స్టెప్పులు ప్రేక్షకులకు పక్కా విజువల్ ట్రీట్‌గా నిలిచాయి. వీరిద్దరి మధ్య కుదిరిన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ పాటకు ప్రధాన ఆకర్షణగా మారింది. విజయ్ పోలాకి అందించిన కొరియోగ్రఫీ పాట స్థాయిని పెంచగా.. ముకేష్ జ్ఞానేష్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, అవినాష్ కొల్లా-కిరణ్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ పాటకు మరింత నిండుదనాన్ని తెచ్చాయి. స్టంట్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్ యాక్షన్ కొరియోగ్రఫీ సమకూరుస్తున్న ఈ భారీ చిత్ర విడుదల తేదీని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

Sunday Tv Movies: దీవాళి బొనాంజా.. ఆదివారం టీవీ సినిమాల లిస్ట్

Teja Sajja: ఎంగేజ్‌మెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

శూర్పణఖ పాత్ర కోసం రోజూ 4 గంటల మేకప్.. రకుల్ ఎమోషనల్ పోస్ట్

Updated Date - Nov 07 , 2026 | 08:56 AM

Tyson Naidu: బెల్లంకొండ ఢీ కొట్టబోయే ఆ లేడీ విలన్ ఎవరో తెలిస్తే షాకవుతారు

Tyson Naidu: రాజస్థాన్‌లో ‘టైసన్ నాయుడు’ కీలక షెడ్యూల్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ గ్లింప్స్

‘రామాయణ’పై డైరెక్టర్ శంకర్ రివ్యూ.. ఇదెవరూ ఊహించలేదు కదా

అప్పుడనుకున్న టైటిల్ ఇప్పుడు.. కమల్ హాసన్ నెక్స్ట్ ఫిల్మ్‌ టైటిల్ ఇదే