‘రామాయణ’పై డైరెక్టర్ శంకర్ రివ్యూ.. ఇదెవరూ ఊహించలేదు కదా

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:09 PM

భారతీయ చిత్ర పరిశ్రమలో విజువల్ వండర్స్, భారీ సెట్టింగ్స్, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ మాయాజాలానికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు శంకర్. అలాంటి దర్శకుడు ఇప్పుడు ‘రామాయణ’కు ఫిదా అయ్యారు.

Shankar on Ramayana

భారతీయ చిత్ర పరిశ్రమలో విజువల్ వండర్స్, భారీ సెట్టింగ్స్, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ (VFX) మాయాజాలానికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు శంకర్ (Director Shankar). తెరపై కనీవినీ ఎరుగని విజువల్స్‌ను ఆవిష్కరించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అలాంటి స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి ఒక సినిమాపై ప్రశంసలు దక్కడం అంటే అది మామూలు విషయం కాదు. తాజాగా నితీష్ తివారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana) పై శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారిలపై ప్రశంసలు కురిపిస్తూ శంకర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.. ‘‘రామాయణ.. వాట్ ఎ స్పెక్టకిల్! ఇలాంటి విజువల్స్‌ను ఇండియన్ సినిమాలో నేనెప్పుడూ చూడలేదు. భారతీయ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లిన నమిత్ మల్హోత్రా, నితీష్ తివారిలకు నా హృదయపూర్వక అభినందనలు. మైండ్ బ్లోయింగ్ వీఎఫ్‌ఎక్స్, అత్యున్నత నిర్మాణ విలువలు, కళ్లు చెదిరే లుక్ అండ్ ఫీల్, ఏఆర్ రెహమాన్ - హన్స్ జిమ్మెర్ అందించిన అద్భుతమైన సంగీతం, భారీ సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాను మరో స్థాయికి చేర్చాయి’’ అంటూ కొనియాడారు.


ఈ చిత్రంలో రావణాసురుడిగా నటించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటనను శంకర్ ప్రత్యేకంగా కొనియాడారు. తెరపై ప్రతి ఫ్రేమ్‌లోనూ యశ్‌ను చూడటం ఒక అద్భుతమైన అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. రావణుడి పాత్రను ఒక ‘లవబుల్ విలన్’గా మలిచిన తీరు, ఆయన కనబరిచిన అత్యున్నత స్థాయి నటన మెస్మరైజ్ చేసిందని ప్రశంసించారు. అలాగే రాముడిగా నటించిన రణ్‌బీర్ కపూర్, సీతగా నటించిన సాయి పల్లవిలకు శంకర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సినిమా గర్వపడేలా ఇంతటి అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తెరపైకి తీసుకొచ్చిన మొత్తం టీమ్‌కు ఆయన అభినందనలు తెలిపారు.


హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో భారత్ నుంచి ప్రపంచ స్థాయికి వెళ్తున్న ఈ సినిమాను.. స్వయంగా విజువల్ జీనియస్ శంకర్ చూసి ఇంతలా మెచ్చుకోవడంతో ‘రామాయణ’పై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఎవరూ ఊహించని రీతిలో వచ్చిన శంకర్ రివ్యూ (Director Shankar Review on Ramayana) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

‘కాకా’ సంక్రాంతికే.. రూమర్స్‌కు కోన వెంకట్ కౌంటర్

బండి సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ చూశారా

‘మహాకాళి’ నుంచి ‘అయిగిరి నందిని’ సాంగ్ విడుదల.. పూనకాలే

Updated Date - Nov 06 , 2026 | 06:09 PM

Director Shankar : కెప్టెన్లంతా కలిశారు

Director Shankar: ప్రతి ఒక్కరి మనసులోని కోపమే ‘సేనాపతి’

Director Shankar: టీవీలు, పేపర్లు అదే గుర్తు చేశాయి.. అందుకే..!

Director Shankar: రజనీకాంత్ బయోపిక్‌ తీయాలని వుందన్న శంకర్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే?

Director Shankar: రామ్ చరణ్‌‌లో ఏదో తెలియని శక్తి ఉంది.. అతనొక విస్ఫోటనం