సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డౌట్స్‌లో ‘గాడ్ ఆఫ్ వార్’.. త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ఎవరితో..

ABN, Publish Date - Nov 20 , 2026 | 09:17 PM

‘ఆదర్శకుటుంబం’తో అంతగా ఆకట్టుకోలేకపోయిన త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?.. ఇదే ఆయన ఫ్యాన్స్ లో మెదలుతున్న ప్రశ్న. యన్టీఆర్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ ఇప్పట్లో లేదని తేలిపోయింది. మరి త్రివిక్రమ్ తరువాతి చిత్రం ఎవరితో?

Trivikram Srinivas

‘ఏకే 47’ (Aadarsha Kutumbam House No: 47) చిత్రం అనుకున్నంతగా సక్సెస్ సాధించకపోవడంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) మళ్ళీ డైలమాలో పడ్డారు. ఈ సారి తీసే సినిమాతో ఎలాగైనా హిట్టు పట్టాలన్నదే త్రివిక్రమ్ అభిలాష. అందులో భాగంగానే ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని కలసి ఓ సబ్జెక్ట్ వినిపించినట్టు తెలుస్తోంది. ఆ చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారనీ సమాచారం. చిరంజీవి ‘కాకా, విశ్వంభర’ తర్వాత ఏ మూవీలో నటిస్తారనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇప్పటికే ఓ నలుగురైదుగురు డైరెక్టర్స్ పేర్లు లిస్ట్‌లో అయితే ఉన్నాయి. అందులో త్రివిక్రమ్ సినిమాకే చిరు ఓటేస్తారని పలువురు ఆశిస్తున్నారు. ప్లాన్ ‘ఏ’గా చిరుని లైన్‌లో పెట్టిన త్రివిక్రమ్.. ప్లాన్ ‘బి’ అంటూ మరో ఆప్షన్ కూడా పెట్టుకున్నారట. ఒకవేళ చిరంజీవితో ప్రాజెక్ట్ సెట్ కాకుంటే తమిళ స్టార్ సూర్య (Suriya)తో ఓ మూవీ చేసేందుకు కూడా త్రివిక్రమ్ ప్రణాళిక వేసుకున్నట్టు సమాచారం. పైగా సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆయనకు మరో మూవీ కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చిందట. ఎటూ ‘సితార’ సంస్థకు త్రివిక్రమ్ వ్యాపారభాగస్వామి కాబట్టి సూర్యతో ప్రాజెక్ట్ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.


ఇటు చిరంజీవి, అటు సూర్య ఎవరో ఒకరు తప్పకుండా తనకు డేట్స్ ఇస్తారని త్రివిక్రమ్ ఆశిస్తున్నారు. ఒకవేళ చిరంజీవి ఓకే అంటే ప్రాబ్లెమ్ లేదు.. ఎందుకంటే వెంటనే సెట్స్‌కు వెళ్ళవచ్చు. చిరు నో చెప్పేస్తే, సూర్య ఓకే అన్నా కనీసం మరో ఏడాది వరకు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే సూర్య ఇప్పటికే టి.జె.జ్ఞానవేల్, మతిమారన్, లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పి ఉన్నారు. అలా సూర్య సరే అన్నా త్రివిక్రమ్‌కు ఆలస్యం కాకతప్పదు. అందువల్ల చిరంజీవి ఓకే అంటేనే త్రివిక్రమ్‌కు అన్ని విధాల కలసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే చిరు ఓ సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్ అంగీకరించకుండా నటించేస్తారు. కాబట్టి చిరంజీవి ఓకే అంటేనే బెటర్ అని త్రివిక్రమ్ ఫ్యాన్స్ సైతం ఆశిస్తున్నారు.


మూడు ప్రాజెక్ట్స్‌ను అంగీకరించేసిన సూర్య ఈ యేడాది చూపించిన స్పీడులో సాగితే త్రివిక్రమ్‌కు డేట్స్ అడ్జెస్ట్ చేయవచ్చు. ఈ యేడాది సూర్య నటించిన ‘వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్, సీన్’ చిత్రాలు తమిళంలోనే కాదు తెలుగునేలపైనా విశేషాదరణ చూరగొన్నాయి. 13 రోజులకే ‘సీన్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. ఇలా ఈ యేడాది వరుసగా ఒక్కోటి 30 కోట్లకు పైగా వసూలు చేసిన మూడు చిత్రాలు ఉన్న ఏకైక హీరోగా సూర్య నిలిచారు. ఓ తెలుగేతర నటుడు తెలుగునాట ఇలా సాగడం ఈ మధ్య కాలంలో లేనేలేదని తెలుస్తోంది. అలా సూర్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ రికార్డును సొంతం చేసుకున్నారు. అలాంటి సూర్య, దర్శకుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెబితే మరింత క్రేజ్ లభించే అవకాశం ఉంది. మరి త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు చిరంజీవి, సూర్య ఇద్దరిలో ఎవరు ఓకే చెబుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

బాలీవుడ్‌కు ‘గరుడవేగ’ అంజి.. ‘అన్ఎక్స్‌పెక్టెడ్’

‘మాతృభూమి’ కోసం సల్మాన్, చిత్రాంగద హైదరాబాద్‌లో సందడి

రజనీకాంత్‌తో ధనుష్ కొడుకు.. ఆ స్టైల్ ఎక్కడికి పోతుంది?

Updated Date - Nov 20 , 2026 | 09:17 PM