Trivikram Praises: ఆయనను పారితోషికంతో కొనలేం

ABN , Publish Date - Aug 13 , 2025 | 05:07 AM

‘సినీ పరిశ్రమలో ఆర్‌.నారాయణ మూర్తిది సుదీర్ఘ ప్రయాణం. కథాలోచన నుంచి సినిమాని ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లే వరకూ ఆయన ఒక్కరే శ్రమిస్తారు. తాను తీసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రయోజనం...

‘సినీ పరిశ్రమలో ఆర్‌.నారాయణ మూర్తిది సుదీర్ఘ ప్రయాణం. కథాలోచన నుంచి సినిమాని ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లే వరకూ ఆయన ఒక్కరే శ్రమిస్తారు. తాను తీసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రయోజనం ఉండాలనుకుంటారు. ఓ సినిమాలోని పాత్రకు నారాయణమూర్తిని అనుకున్నా. కానీ, పారితోషికంతో ఆయనను కొనలేం అని ఎవరో చెప్పారు’ అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. నారాయణ మూర్తి కొత్త చిత్రం ‘యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’ చిత్రాన్ని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో త్రివిక్రమ్‌ చూశారు. ఆనంతరం మాట్లాడుతూ ‘ఈ చిత్రంలోని అంశాలు వెంటనే ఉత్తేజపరచవు. అయినప్పటికీ పట్టువిడవకుండా నడిపించారు. నిజాయతీతో పనిచేశారు. అది ఆయన సొంతం. దాని కోసమే నేను వచ్చాను. రాజీపడకుండా బతకడం అందరికీ సాధ్యం కాదు. నేను చాలా సార్లు రాజీపడ్డా’ అని అన్నారు. ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘నాకు, త్రివిక్రమ్‌కు మధ్య ఎలాంటి ఆబ్లిగేషన్స్‌ లేవు. నా పట్ల, నా సినిమా పట్ల ఆయనకు అభిమానం ఉంది. ‘యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’ చూసి దాన్ని ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయాలని కోరా. నా విజ్ఞప్తిని మన్నించి, సినిమాను చూసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని అన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 05:10 AM